Methi Flaxseed and Rice Hair Pack : ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసే హెయిర్ ప్యాక్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిలో మెంతులు, అవిసె గింజలు, బియ్యంతో చేసే హెయిర్ ప్యాక్ ఒకటి. ఈ మూడు పదార్థాల్లో ఉండే పోషకాలు జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా మెరుపును కూడా అందిస్తాయి.

Continues below advertisement

హెయిర్ ప్యాక్ బెనిఫిట్స్

మెంతుల్లోని ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ రూట్స్‌ను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు నేచురల్ షైన్ ఇచ్చి సాఫ్ట్‌గా మారుస్తాయి. బియ్యంలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. జుట్టు పొడవుగా పెరగడంలో ఉపయోగపడతాయి.ఈ ప్యాక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి డ్రైనెస్‌ తగ్గిస్తుంది. రెగ్యులర్​గా వాడితే చుండ్రు సమస్య క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. జుట్టు పలుచగా, బలహీనంగా ఉన్నవారికి ఈ ప్యాక్ మంచి ఎంపిక. ఇవి కుదుళ్లను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. మరి ఈ హెయిర్​ప్యాక్​ని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఎలా అప్లై చేస్తే మంచిదో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

మెంతులు – 2 టేబుల్ స్పూన్లు

Continues below advertisement

అవిసె గింజలు – 2 టేబుల్ స్పూన్లు

బియ్యం – 3 టేబుల్ స్పూన్లు

నీరు – అవసరమైనంత

తయారీ విధానం

ముందుగా మెంతులు, అవిసె గింజలు, బియ్యాన్ని విడివిడిగా కడిగి 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మరికొంత నీరు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచి.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. 

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. హెయిర్ ప్యాక్ వేసే ముందు జుట్టు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత అప్లై చేయాలి. సహజ పదార్థాలతో తయారయ్యే ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు మంచి పోషణ అందించి.. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కెమికల్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా పాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. రెగ్యులర్‌గా వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

జుట్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.