మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)... ఇద్దరూ మంచి స్నేహితులు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో నటించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళిద్దరి స్నేహం కనిపించింది కూడా! కానీ, ఇప్పుడు ఇద్దరి అభిమానుల మధ్య కాంపిటీషన్ మొదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ (Dragon Glimpse) విడుదలైంది. ఆ గ్లింప్స్ రావడానికి కొన్ని గంటల ముందు 'పెద్ది' ట్రైలర్ (Peddi Trailer) విడుదలైంది. రెండిటిలో ఏది బావుంది? ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది చూస్తే...

Continues below advertisement

మాసీ 'డ్రాగన్'... రూరల్ 'పెద్ది'!అభిమానులకు కావాల్సిన 'హై' గానీ... చూసిన వెంటనే సినిమాపై ఇంట్రెస్ట్ గానీ క్రియేట్ చేసినది అయితే మాత్రం నిస్సందేహంగా 'డ్రాగన్' గ్లింప్స్ అని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. గ్లింప్స్ పేరుతో నాలుగున్నర నిమిషాల వీడియో విడుదల చేశారు ప్రశాంత్ నీల్. అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ సెకన్ నుంచి గ్లింప్స్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఆ ప్రపంచంలోకి ప్రతి ప్రేక్షకుడిని తీసుకు వెళ్లారు. అన్నిటి కంటే ముఖ్యంగా అభిమానులు ఎన్టీఆర్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు నీల్. 

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

Continues below advertisement

మెగా అభిమానులు కోరుకున్నట్టు రామ్ చరణ్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించలేదా? అంటే... చూపించారు. కానీ, ఫ్యాన్స్ కోరుకునే 'హై' ఇవ్వడంలో 'పెద్ది' ట్రైలర్ ఫెయిల్ అయ్యింది. అభిమానుల సంగతి పక్కన పెడితే... కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. 'డ్రాగన్'లో ఎన్టీఆర్ చెప్పినట్టు మాసీ డైలాగులు ఏవీ రామ్ చరణ్ నోటి నుంచి రాలేదు. ట్రైలర్ కట్ కూడా క్యూరియాసిటీ కలిగించలేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ, కుదరలేదు. ఎక్కడో బెడిసి కొట్టింది.

లుక్కు విషయంలో చెర్రీకి మార్కులు!'పెద్ది' ట్రైలర్ సినిమాకు అవసరమైన బజ్ క్రియేట్ చేయడంలో ఫెయిలైనా సరే... లుక్ విషయంలో రామ్ చరణ్ మార్కులు కొట్టేశారు. క్రికెట్ నుంచి కుస్తీకి బాడీ పరంగా ఆయన చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియన్స్ అందరి అప్రిసియేషన్ అందుకుంది. అదే సమయంలో ఎన్టీఆర్ లుక్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన మరీ సన్నగా ఉన్నారని, గడ్డం పెంచడంతో అదోలా ఉన్నారని కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయి.

Also ReadRavi Mohan Wife Aarti Background Family Details - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలతో రామ్ చరణ్ ఫ్లాప్స్ అందుకున్నారు. 'పెద్ది'తో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో సినిమాకు అవసరమైన బజ్ ఇంకా రాలేదు. దర్శకుడు బుచ్చిబాబు అండర్ ప్లే చేస్తున్నారని ఓ టాక్ ఉంది. సినిమాలో చివరి 50 నిమిషాలు ఎమోషనల్ హై ఇస్తుందని బుచ్చి చెబుతున్నారు. అది క్లిక్ అవ్వడంపై సినిమా రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. 

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన 'దేవర' మంచి హిట్. కానీ, హృతిక్ రోషన్‌తో నటించిన బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' ఫ్లాప్. ఇప్పుడు ఆయనకూ హిట్ అవసరం. అందువల్ల, 'డ్రాగన్' విషయానికి వస్తే... యాక్షన్ ఎంటర్టైనర్. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ అభిమానులకు 'హై' ఇచ్చింది. ప్రస్తుతానికి ఎన్టీఆర్‌ది అప్పర్ హ్యాండ్ అని చెప్పక తప్పదు.

Also ReadKeneeshaa Francis - ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?