తమిళ కథానాయకుడు రవి మోహన్ ('జయం' రవి), ఆయన భార్య ఆర్తి (Aarti Ravi) విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు కెనీషా ఫ్రాన్సిస్ (Keneeshaa Francis). ఆమెతో రవి మోహన్ ప్రేమలో పడ్డారు. విడాకులు రాక ముందు కలిసి తిరిగారు. అసలు ఎవరీ కెనీషా? రవి మోహన్ (Ravi Mohan)తో పరిచయం, ప్రేమ నుంచి బ్రేకప్ వరకు... అంతకు ముందు కెనీషా ఫ్రాన్సిస్ లైఫ్ గురించి తెలుసుకోండి.   

Continues below advertisement

తండ్రిది తమిళం... అమ్మ ఆఫ్రికన్!Keneeshaa Francis Parents: భిన్నమైన సంస్కృతి మధ్య పెరిగిన మహిళ కెనీషా ఫ్రాన్సిస్. ఆమె బెంగళూరుకు చెందిన కళాకారిణి. పుట్టింది, పెరిగింది అక్కడే. ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే... కెనీషా తండ్రి తమిళియన్ కాగా, అమ్మ కెన్యాకు చెందిన ఆఫ్రికన్ సంతతి మహిళ.

కెన్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, ఇండియా... ఇప్పటి వరకు కెనీషా తన జీవితాన్ని వివిధ దేశాలలో గడిపారు. తల్లిదండ్రులు ఇద్దరికీ సంగీత నేపథ్యం ఉంది. సంగీత కుటుంబం నుంచి వచ్చిన కెనీషాకు చిన్నతనం నుంచి కళలపై ఆసక్తి ఉండేది. మ్యూజికల్ రియాలిటీ షో 'ది స్టేజ్' ద్వారా గాయనిగా తొలి గుర్తింపు పొందారు. గాయకురాలిగా గోవాలో ఆమె చాలా పాపులర్. 

Continues below advertisement

సింగర్ మాత్రమే కాదు... మల్టీ ట్యాలెంటెడ్!కెనీషా ఫ్రాన్సిస్ కేవలం గాయని మాత్రమే కాదు... ఆమెలో నృత్యకారిణి, థెరపిస్ట్, స్పిరిచువల్ హీలర్ కూడా ఉన్నారు. ఎనిమిది రకాల లాటిన్ నృత్య రూపాలలో తాను శిక్షణ పొందినట్టు గతంలో ఓసారి కెనీషా తెలిపారు. గోవాలోని లైవ్ మ్యూజిక్ రంగంలో ఆమెకు మంచి పేరుంది. 

ఎడ్యుకేషన్ విషయానికి వస్తే... చిన్నప్పటి నుంచి సింగింగ్‌లో శిక్షణ పొందిన కెనీషా... సైకాలజీ చదివారు. తనను తాను 'థెరపిస్ట్‌'గా పేర్కొంటారామె. అయితే థెరపిస్ట్ అని చెప్పడానికి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఎక్కడా ప్రొడ్యూస్ చేయలేదు. కౌన్సెలింగ్‌, మెడిటేషన్, స్పిరిచ్యువల్ హీలింగ్ ద్వారా ప్రజలకు మానసిక ప్రశాంతత అందించే ప్రయత్నం చేస్తున్నానని చెబుతారు.

రవి మోహన్ జీవితంలో ఎప్పుడు వచ్చారు?తనతో మాట మాత్రమైనా చెప్పకుండా విడాకులకు రవి మోహన్ అప్లై చేశారని ఆర్తి పేర్కొన్నారు. రవి మోహన్ విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత... కెనీషాతో కలిసి ఓ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం చర్చకు దారితీసింది. ఎవరు ఆ అమ్మాయి? అని తమిళ జనాలు ఆరా తీయడం మొదలైంది.

Also Read: Ravi Mohan Press Meet Ful Speech - కెనీషాతో బ్రేకప్, ఆర్తితో డివోర్స్‌పై 'జయం' రవి సంచలన ప్రెస్‌మీట్... రెచ్చిపోతే తట్టుకోలేరంటూ

గోవాలో రవి మోహన్, కెనీషా మధ్య పరిచయమైనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిచయం తర్వాత కాలంలో ప్రేమకు దారి తీసింది. కెనీషా రూపొందించిన ఓ పాట వీళ్ళిద్దరినీ దగ్గర చేసింది. అయితే... ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించిన 2024లో కెనీషా తెరపైకి వచ్చారు. దర్శకుడిగా, నిర్మాతగా మారిన సమయంలో చెన్నైలో ఈవెంట్ చేశారు రవి మోహన్. అందులో కెనీషా సందడి చేశారు. రవి మోహన్, ఆయన తల్లితో కలిసి ఫోటోలు దిగారు. 

Also Read: Aarti Ravi Counter To Ravi Mohan - సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తనకు కెనీషా అండగా ఉందని, ఒక 'లైఫ్ లైన్'లా నిలిచిందని రవి మోహన్ పేర్కొన్నారు. అయితే తమది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ సపోర్ట్ అన్నారు. ఆర్తితో వివాహ బంధంలో తానొక బానిసలా బ్రతికానని రవి మోహన్ చెప్పడం తమిళ చిత్రసీమలో తీవ్ర కలకలం సృష్టించింది. విడాకుల తర్వాత కెనీషాతో కలిసి తిరగడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. రవి మోహన్, అలాగే చెన్నై నుంచి వెళుతున్నట్లు కేనీషా చెప్పడంలో బ్రేకప్ చెప్పినట్టేనని అర్థం అవుతోంది. ప్రస్తుత వివాదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురై సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు కెనీషా కూడా ప్రకటించారు.    

కెనీషా ఆస్తి విలువ ఎంత? మూడు కోట్లు??లైవ్ షోలు చేయడం, మ్యూజిక్ ప్రాజెక్ట్స్, అలాగే థెరపీ సెషన్స్ ద్వారా కేనీషా ఫ్రాన్సిస్ సంపాదిస్తున్నారు. అలాగే బ్రాండ్ పార్టనర్‌షిప్‌ల ద్వారా ఆమెకు కొంత అమౌంట్ వస్తుంది. ఓ అంచనా ప్రకారం... కెనీషా ఫ్రాన్సిస్ నెట్ వర్త్ కోటి ఉంచి మూడు కోట్ల రూపాయల మధ్య ఉంటుంది.

Also Read: Ravi Mohan Vs Sujatha Vijayakumar - అల్లుడిగా అది నీ బాధ్యత... ఆమాత్రం ఖర్చు పెట్టలేవా? 'జయం' రవిపై అత్త సుజాత ఫైర్