Men Lose Hair Early : ముప్పై ఏళ్లు కూడా నిండకముందే చాలా మంది మగవారు జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 20ల్లోనే బట్టతల సమస్య వారిని ఇబ్బంది పెడుతుంది. దువ్వెనలో, నేలపై రాలిన జుట్టు చూసి ఆందోళన పడటమే వారి వంతు అవుతుంది. ఇది బ్రేకప్ కంటే దారుణంగా వారిని బాధపెడుతుంది. దీంతో వారిలో ఇన్​సెక్యూరిటీ ఎక్కువ అవుతుంది.

Continues below advertisement

నిజానికి రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ అంతకంటే ఎక్కువ రాలుతున్నప్పుడు.. తల పైభాగం నుంచి జుట్టు పలచగా అవుతుంటే అది హెయిర్​ లాస్ అవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్య పెరిగి బట్టతలగా మారుతుంది. ఇలా జుట్టు రాలడానికి కారణాలు ఏంటి? నిజంగా పని చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మగవారి జుట్టు రాలడానికి కారణాలు 

చాలామందికి జెనిటిక్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే తండ్రి లేదా తాత వైపు బట్టతల ఉంటే.. వారికి కూడా జుట్టు రాలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే టెస్టోస్టిరాన్ నుంచి తయారయ్యే డీహెచ్​టీ (Dihydrotestosterone) అనే హెయిర్ ఫాలికల్స్ జుట్టు పలచబడేలా చేస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఎక్కువగా జుట్టు రాలుతుంది.

Continues below advertisement

ఇవే కాకుండా పోషకాహార లోపం కూడా జుట్టు రాలేందుకు కారణమవుతుంది. ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ డి లోపాలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందిస్తాయి. అవి అందకుంటే జుట్టు రాలిపోతుంది. చుండ్రు, ఫంగల్ ఇన్​ఫెక్షన్ వంటి స్కాల్ప్ సమస్యలు జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. బీపీ, స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు కూడా జుట్టు రాలేలా చేస్తాయి. నిద్ర లేకుంటే కార్టిసాల్ పెరిగి.. జుట్టును నేరుగా ప్రభావితం చేస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. 

ఎవరికి జుట్టు రాలే సమస్య ఎక్కువ..?

95 శాతం పురుషులకు జుట్టు రాలడానికి జన్యుపరమైన బట్టతలే కారణం. ఇది వారసత్వంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో తల్లి వైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది దశల వారీగా జరుగుతుంది. నుదుటి రెండు పక్కల నుంచి హెయిర్ లైన్ వెనక్కి తగ్గుతుంది. తర్వాత తల పైభాగం పలచగా మారుతుంది. తర్వాత పూర్తి బట్టతలగా మారుతుంది. 

బట్టతలను తగ్గించే చిట్కాలు..

రోజుకు కనీసం 5 నుంచి 10 నిమిషాలు వేళ్లతో తల మర్దన చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి హెయిర్ ఫాలికల్స్​కి పోషణ బాగా అందుతుంది. కొబ్బరి నూనె, ఆముదరం రాసి చేసుకోవచ్చు. లేదా కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి.. కాచి ఆ నూనెను చల్లార్చి వాడుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఆముదం వారానికి 2 సార్లు రాసి 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది. 

ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. వారానికి 3 సార్లు స్కాల్ప్​కి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. కలబంద గుజ్జు కూడా చుండ్రు తగ్గించి.. జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. దీనిని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి 3 సార్లు వాడుకోవచ్చు. గుడ్డులోని ప్రోటీన్, బయోటిన్ జుట్టు బలహీన పడకుండా హెల్ప్ చేస్తుంది. తిన్నా, హెయిర్ మాస్క్ వేసుకున్నా మంచిదే. 

ఫుడ్​లో చేయాల్సిన మార్పులు

తీసుకునే ఆహారం కూడా జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. గుడ్లు, పాలకూర, చేప, వాల్‌నట్, చికెన్, గుమ్మడి గింజలు, బెర్రీస్ తినాలి. షుగర్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆల్కహాల్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. కాబట్టి జుట్టు రాలడం గమనించినప్పుడు భయపడకుండా.. కారణం తెలుసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. 

వైద్య సహాయం..

సహజ పరిష్కారాలు తగినంత ఫలితం ఇవ్వకపోతే.. వైద్యుడి సలహాతో జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు. FDA అప్రూవ్ చేసిన మినాక్సిడల్ వైద్యుల సహాయంతో తీసుకోవచ్చు. ఇది రక్తప్రసరణ పెంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. రోజుకు 2 సార్లు వాడాలి. 3 నుంచి 6 నెలల్లో ఫలితం కనిపిస్తుంది. వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. DHT హార్మోన్​ని బ్లాక్ చేసే మెడిసన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవే కాకుండా పీఆర్పీ, సర్జికల్, హెయిర్ ట్రాన్సప్లెంట్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.