Tips for Healthy Hair :వాతావరణం పొడిగా ఉండే సమయంలో జుట్టు కూడా పొడిబారి ఫ్రిజ్జీగా మారుతుంది. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతిని చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సమయంలో హెయిర్ కేర్ రోటీన్​ను కచ్చితంగా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎలాంటి టిప్స్ ఫాలో అయితే జుట్టు స్ట్రాంగ్​గా మారి.. రఫ్​గా మారడం తగ్గుతుందో.. షైనీ, హెల్తీగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


క్లెన్సింగ్.. 


జుట్టు రాలకుండా హెల్తీగా ఉండాలంటే.. స్కాల్ప్​ని కచ్చింతగా క్లెన్స్ చేయాలి. స్కిన్ అయినా.. జుట్టు అయినా.. మరి ఏ ఇతర ఆరోగ్య సమస్య అయినా తగ్గాలంటే ముందు దానిని శుభ్రం చేసుకుని.. తదుపరి చిట్కాలు, చికిత్సలు ఫాలో అవ్వాలి. జుట్టు విషయంలో కూడా ఇదే ఫాలో అవ్వాలి. కాబట్టి జుట్టును క్లెన్స్ చేసేందుకు సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి. స్కాల్ప్​పై ఉండే సహజమైన ఆయిల్స్ పోయేలా గట్టిగా రుద్దకుండా.. సున్నితంగా మసాజ్ చేస్తూ.. డర్ట్ వదిలించుకోవాలి. 


కండీషనర్


షాంపూ చేసే వారు కచ్చితంగా కండీషనర్ అప్లై చేయాలి. చాలామంది తలస్నానం చేస్తారు కానీ.. తర్వాత చేయాల్సిన ముఖ్యమైన కండీషనింగ్​ని మాత్రం విస్మరిస్తారు. దీనివల్ల జుట్టు మరింత ఫ్రిజ్జీగా, రఫ్​గా మారుతుంది. జుట్టుకు మృదువుగా, హెల్తీగా ఉండేందుకు కచ్చితంగా కండీషనర్ అప్లై చేయాలి. 


హెయిర్ మాస్క్​


జుట్టుకు కుదుళ్ల నుంచి సంరక్షణ, మాయిశ్చరైజింగ్ అందించేందుకు వారానికి ఓసారి హెయిర్ మాస్క్ వేసుకోవాలి. దీనివల్ల జుట్టుకు లోపలి నుంచి కండీషనింగ్ అందుతుంది. అంతేకాకుండా జుట్టు పట్టులా సాఫ్ట్​గా మారుతుంది. 


హెయిర్ స్టైలింగ్స్


అందంగా కనిపించేందుకు జుట్టును వివిధ రకాలుగా స్టైల్ చేస్తారు. అయితే ఆ సమయంలో వినియోగించే హీటింగ్ టూల్స్ వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. తప్పనిసరి అనుకున్నప్పుడు జుట్టుకి ముందుగా హీట్ ప్రొటెక్ట్ సీరమ్స్ అప్లై చేసి.. స్టైల్ చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. 


కవర్ చేసుకోండి..


వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో చెప్పలేము. ఎండలోనూ, వానలోనూ జుట్టు డ్యామేజ్ కాకూడదంటే.. దానిని కవర్ చేయాలి. అప్పుడే జుట్టు హెల్తీగా ఉంటుంది. జుట్టు రాలదు. కాలుష్యం, దుమ్ము, ధూళి పడకుండా జుట్టును కవర్ చేసుకోవడం వల్ల స్కాల్ప్, హెయిర్ హెల్తీగా ఉంటుంది. 



హైడ్రేషన్.. 


శరీరానికి, స్కిన్​కే కాకుండా నీళ్లు జుట్టుకు కూడా బెనిఫిట్స్ ఇస్తాయి. కాబట్టి డీహైడ్రేట్ కాకుండా నీటిని శరీరానికి అందిస్తూ ఉండాలి. ఇది జుట్టు హైడ్రేటెడ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. లోపలి నుంచి జుట్టును హెల్తీగా, సిల్కీగా మారుస్తుంది. 


ట్రిమ్​ చేయాలి.. 


జుట్టు చివర్లు చాలాసార్లు డ్రై అయిపోవడం, పొడిబారడం, స్పిల్ట్ ఎండ్స్ రావడం జరుగుతుంది. దీనివల్ల చిక్కులు ఎక్కువగా పడిపోయి జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి జుట్టును హెల్తీగా ఉంచుకునేందుకు రెగ్యూలర్​గా ట్రిమ్ చేయాలి. కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఓసారి చివర్లు ట్రిమ్ చేసుకోవడం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. డెడ్ ఎండ్స్ ఉండవు. 


స్కాల్ప్ కేర్..


జుట్టుపై పెట్టినంత శ్రద్ధ స్కాల్ప్​పై పెట్టాలి అంటారు నిపుణులు. ఎందుకంటే జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ అవ్వాలంటే స్కాల్ప్​కి నూనెతో మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టు పెరుగుదల హెల్తీగా ఉంటుంది. కుదుళ్ల నుంచి జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. 


దువ్వెన


జుట్టును రెగ్యూలర్​గా దువ్వుకుంటారు కానీ.. ఎలాంటి దువ్వెనను వాడాలో చాలామందికి తెలీదు. పళ్లు గ్యాప్ ఎక్కువగా ఉండే వైడ్ కోంబ్​ చిక్కుళ్లను తీసుకోవడంలో హెల్ప్ చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనివల్లు స్పిల్ట్ ఎండ్స్ కూడా ఎక్కువగా రావు. 


అతిగా వద్దు


రోజు తలస్నానం చేసే బదులు రోజు విడిచి రోజూ.. లేదా రెండ్రోజులకు ఓసారి తలస్నానం చేస్తే మంచిది. రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు బాగా డ్రై అయి రాలిపోతుంది. 



వీటిని రెగ్యూలర్​గా ఫాలో అవ్వడంతో పాటు.. తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టురాలడం తగ్గుతుంది. అంతేకాకుండా గట్ హెల్త్ కూడా మెరుగవుతుంది. ఏ సీజన్​లో అయినా ఈ రెగ్యూలర్ టిప్స్ ఫాలో అయితే హెయిర్ ఫాల్ సమస్యే ఉండదంటున్నారు నిపుణులు. 



Also Read : జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే