Brahmamudi Serial Today Episode: ఇందుతో కలిసి ఆఫీసుకు వెళ్లిన రాజు. అక్కడ రేఖకు షాక్ ఇవ్వడంతో బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అంతకు ముందు రాజు ఇంటి దగ్గర భ్రమరాంబను బెదిరించి కారు కీస్ తీసుకుంటాడు.
రాజు: చూశావా..? కారు కీస్ ఎలా తీసుకున్నానానో.. ఏంటి ఇందు కారు ఎలా వస్తుంది అన్నావు.. ఇదిగో ఇలా వస్తుంది. పద మన సూటుకు బూటుకు తగ్గట్టుగా రిచ్‌గా కారు ఎక్కి ఆఫీసుకు వెళ్దాం వెళ్లు కారెక్కు.. టాటా బైబై అత్తయ్య..
భ్రమరాంబ: అయ్యో నా కారు.. నా కారు.. ఓరి వీడి దుంప తెగ కారేంటి అలా వేసుకుని వెళ్లాడు
శేషు: నేను అనుకుంటూనే ఉన్నానే ఏదో రకంగా వీడు మాయ చేస్తాడు అని
భ్రమరాంబ: అవును మీరు అనుకుంటూనే ఉంటారు.. అయినా నడుము దగ్గర ఉన్న తాళం ఎలా చూశాడు వీడు..
శేషు: వాడిని చూస్తుంటే.. దొంగలకు దొంగలా ఉన్నాడు భ్రమర.. గజదొంగలా కనిపిస్తున్నాడు. ముందు ఇంకా ఏం దోసుకుంటాడో ఏమో.. నువ్వు మదన్‌ను ఈ ఇంటి యువరాజులా చూడాలి అనుకున్నావు. కానీ ఆ దేవుడు ఎందుకో మరోలా స్ర్రిప్ట్ రాశాడు అనిపిస్తుంది.
ALSO READ: హోమ్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? తగ్గితే మెరుగుపరిచే 5 మార్గాలు ఇవే
అనగానే భ్రమరాంబ శేషును తిడుతుంది. అపశకునం మాట్లాడొద్దు అంటూ కోప్పడుతుంది. ఇక అపర్ణ, సుభాష్ దగ్గరకు వెళ్లి రాజు, ఇందులను చూస్తుంటే.. రాజ్, కావ్యలను చూసినట్టే ఉందని ఎమోషనల్ అవుతుంది. సుభాష్ కూడా తనకు అలాగే ఉందని ఇందుకు మంచి రోజులు వచ్చాయని చెప్తాడు.
అపర్ణ: మరీ ముఖ్యంగా రాజు నా దగ్గరకు వచ్చినప్పుడు రాజ్, కావ్య వచ్చినప్పుడు మనసులో ఎలాంటి సంతోషం ఉండేదే అలాంటి సంతోషమే అనిపిస్తుంది.
సుభాస్: అవును అపర్ణ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి లాక్కుంటే మరొక రూపంలో ఇంకొకటి ఇస్తాడంటారు కదా..? రాజ్, కావ్యలను దూరం చేసిన దేవుడే తిరిగి వాళ్ల రూపంలో రాజు, ఇందులను ఇచ్చాడు.
అంటూ ఇద్దరు ఒకిరికొకరు చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతారు. మరోవైపు ఆఫీసులో స్టాప్ మొత్తం ధర్నా చేస్తుంటే రేఖ వాళ్లను తిడుతుంది.
రేఖ: మీకు నేను తప్ప వేరే దిక్కు ఉందా..? మీరు బయటకు వెళ్లి జాబ్ సంపాదిస్తారా..? మిమ్మల్ని నేను బ్లాక్ లిస్ట్‌లో పెట్టానంటే బయట మీకు ఎవ్వరూ జాబ్ ఇవ్వరు. అలా అని నన్ను బెదిరిస్తూ ఇక్కడే ఉన్నా మీకు శాలరీలు రావు.. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీకు ఇక్కడ సపోర్టుగా ఎవ్వరూ లేరు
అప్పుడే రాజు, ఇందు ఎట్రీ ఇస్తారు. రాజును చూసి రేఖ షాక్ అవుతుంది.
రేఖ: ఇందు వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు
ఇందు: నేను తీసుకురాలేదు ఆంటీ.. వాడే ఆఫీసుకు వెళ్దామని నేను వద్దంటే మన రహస్యం అందరికీ చెప్తానని బెదిరించాడు అందుకే వచ్చాము
రాజు: ఏంటి ఇక్కడ అంతా ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు
సుభాష్: గూడు పుఠాణి ఏం లేదు.. స్టాఫ్‌కు ఇవ్వాల్సిన శాలరీ గురించి మాట్లాడుతున్నాము
రాజు: దానికి అంత టెన్షణ్ ఎందుకు నేను వచ్చేశాను. కదా ఇక నుంచి అన్ని మారిపోతాయి
రేఖ: ఇక్కడ మేము ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే.. నువ్వు జోక్ చేస్తున్నావా…
రాజు: ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను.. ఇక మీరు వెళ్లొచ్చు
అని రాజు చెప్పగానే.. రేఖ వెళ్లిపోతుంది. రాజు, ఇందు ఎంప్లాయీస్‌ను కన్వీన్స్ చేసి పనిలోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత ఆంటోని రేఖను కలడానికి ఆఫీసుకు వెళ్తాడు. ఆంటోనిని చూసిన రేఖ షాక్ అవుతుంది. బయటకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఆంటోని రేఖ కొడుకు గురించి ఎవ్వరికీ చెప్పకూడదంటే నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అందుకు రేఖ ఒప్పుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
