Mental health Day: పెరుగుతున్న సాంకేతికత జీవితాలను ఎంత సుఖమయం చేస్తున్నాయో అంతలా ఒత్తిడికి కూడా గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో ఈ ఒత్తిడి చాలా ఎక్కువ ఉందని లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నారు. ఓవైపు చదువుకోవాలనే ఒత్తిడి, మనసులను లాగేస్తున్న సోషల్ మీడియా, ఆకట్టుకుంటున్న లేటెస్టు టెక్నాలజీ మధ్య పసిమనసులు చిత్తు అవుతున్నాయి. మెంటల్ హెల్త్ డే సందర్భంగా అసలు విద్యార్థులు ప్రశాంతంగా చదువుపై దృష్టి పెట్టేందుకు ఏం చేయాలో చూద్దాం.


విద్యార్థుల్లో రోజు రోజుకు యాంగ్జైటీ, స్ట్రెస్, ఒంటిరిగా ఉన్నామనే భావన రోజు రోజుకు పెరిగిపోతోంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఓవైపు వారిని పక్కదారి పట్టిస్తుంటే చదువు పేరుతో సమాజం వారిపై పెడుతున్న ఒత్తిడి కారణంగా విపరీతమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. లెటెస్ట్ టెక్నాలజీని వాడకంలో నేటి తరం ముందంజలో ఉన్నప్పటికీ దాన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. 


టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్న విద్యార్థులు వెర్బల్ కమ్యూనికేషన్‌కు దూరంగా జరుగుతున్నారు. ఎక్కడో అమెరికాలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, గాడ్జెట్స్‌ గురించి తెలుసుకుంటున్నారే తప్ప తన ముందున్న వాటి సంగతి మర్చిపోతున్నాడు. నేరుగా మనుషులతో మాట్లాడే సందర్భాలు తగ్గిపోతున్నాయి. వాటి స్థానాన్ని డిజిటల్ కమ్యూనికేషన్ పరికరాలు ఆక్రమించేశాయి. సరదా అంటే ఓటీటీలో సినిమా, సంతోషం అంటే ఆన్‌లైన్ గేమ్స్‌, అచీవ్‌మెంట్స్ అంటే లైక్‌లుషేర్లు అన్నట్టు మారిపోతోంది. పూర్తిగా డిజిటల్ ఊబిలో మునిగిపోతున్నారు.  


డిజిటల్ టూల్స్ అనేవి రెండు వైపుల పదును ఉన్న కత్తులు లాంటిది. అందుకే దీన్ని జాగ్రత్తగా వాడుకున్న వ్యక్తి మంచిదారిలో వెళ్తుంటే దాన్ని ఇతర మార్గాల్లో వాడుకున్న విద్యార్థులు చతికిల పడుతున్నారు. మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. అలాంటి వారు ఈ సలహాలు పాటిస్తే డిజిటల్ ఊబి నుంచి బయటపడటమే కాకుండా వాటిని వాడుకొని విజేతలు కాగలుగుతారు. 


ఆఫ్‌లైన్ యాక్టివిటీస్‌ పెంచాలి


చాలా మంది విద్యార్థులు ఖాలీ దొరికితే చాలు మొబైల్ ఫోన్ పట్టుకుంటారు లేదా. టీవీ ఆన్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఫ్యామిలీలో నిత్యం చూస్తున్న చిత్రమే. అందుకే ఇలాంటి వారిని కట్టడి చేయడానికి ఏకైక మార్గం వాళ్లను వేరే వేరే పనుల్లో ఎంగేజ్ చేయాలి. మొదట్లో దీని వల్ల వారు కాస్త ఒత్తిడి గురి అవుతారు. అయినా అందులో ఆనందాన్నివెతుక్కునేలా చేయాలి అప్పుడే వారిలో మార్పు కనిపిస్తుంది. 


ఎక్కువ టైం స్క్రీన్ చూడటం వల్ల జరిగే అనర్థాలు వారికి వివరించాలి. యాంగ్జైట్ పెరిగిపోవడం, కుంగుబాటు, నిద్రలేమి సమస్యలు వస్తాయని తెలియజేయాలి. ఇంకా ఇబ్బందిగా ఉంటే కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయించాలి. 


రోజులో ఎంత చూస్తున్నారు. ఏం చూస్తున్నారనే విషయాలను గమనించాలి. వాటిని నోట్ చేసుకొని స్క్రీన్ టైమింగ్ తగ్గించే ప్లాన్ చేయాలి. వాళ్లు ఆన్‌లైన్‌లో ఇష్టంగా చూసే వాటిని పోలిన ఆఫ్‌లైన్ గేమ్స్ కాని, ఇతర యాక్టివిటీస్‌ కానీ చేయించాలి. మొదట అరగంటతో మొదలు పెట్టి అలా పెంచుతూ వెళ్లాలి. వారికి తెలియకుండానే ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ అలవాటు చేయించాలి. 


తరచూ స్నేహితుల ఇంటికి పంపించడం, బంధువుల ఇంటికి తీసుకెళ్లడం, పార్కుల్లో ఆడిపించడం, ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ లాంటివి అలవాటు చేయాలి. ఆటలతో అలసిపోయేలా ఏదైనా క్రీడల్లో శిక్షణ ఇప్పించాలి. మీరు కూడా స్క్రీన్ టైం తగ్గించేందుకు ప్రయత్నించాలి. మీరు డిజిటల్‌ పరికాలు వాడుతుంటే  చూస్తున్నప్పుడు వాళ్లు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వాళ్లు మీతో ఉన్నప్పుడు టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ చూడకుండా ఉండాలి. ముఖ్యంగా రాత్రి పడుకునేందుకు దాదాపు గంట గంటన్నర ముందు అసలు టీవీ, ఫోన్ చూడకుండా చేయాలి. మీరూ పాటించినప్పుడే వారిలో కూడా మార్పును చూస్తారు. 


డిజిటల్ టూల్స్‌ను మెంటల్ హెల్త్‌కు అనుకూలంగా మార్చుకోండి
ఈ మధ్య కాలంలో చాలా రకమైన డిజిటల్ టూల్స్ వచ్చాయి. వాటిలో మన మెంటల్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన డిజిటల్‌టైమింగ్‌ను తెలియజేసే యాప్స్ వచ్చాయి. వాటితో కొంత వరకు డిజిటల్ డిటాక్స్‌ అవ్వొచ్చు. స్ట్రేస్ తగ్గించే సంగీతం వినొచ్చు, మూడ్ ట్రాక్ చేసే యాప్‌లతో మూడ్‌ సెట్ చేసుకోవచ్చు. వీటి వల్ల విద్యార్థుల్లో తరచూ వచ్చే యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. 


కొన్ని విద్యాసంస్థలు టెలీపతి, మెంటల్ హెల్త్‌ హాట్‌లైన్స్‌ సదుపాయం కల్పిస్తుంటారు. వారితో మాట్లాడి ఆన్‌లైన్‌లోనే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇలా రోజు వారి జీవితంలో మెంటల్ హెల్త్‌ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఆనందకరమైన భవిష్యత్‌కు పునాదుల వేస్తాయి. 


నెట్‌వర్క్‌ను పెంచుకోండి
విద్యార్థుల్లో సోషల్ మీడియా ఒత్తిడి అన్నింటి కంటే చాలా ప్రమాదకరమైంది. ఒకప్పుడు క్లాస్‌ రూంలోనో లేదా ఇంటి పరిసరాల్లోనో పోలిక అనేది ఉండేది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆ పోలిక తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది విద్యార్థులను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. ఇక్కడ విద్యార్థి తనకి తానే శత్రువుగా మారిపోతున్నాడు. తనను ఇతరులతో  అన్ని విషయాల్లో పోల్చుకుంటున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు తనకు అనుకూలమైన వారితో నెట్‌వర్క్ పెంచుకోవాలి. 


మానసికంగా ఇబ్బంది పడే వాళ్లకు సాయం చేసే గ్రూప్‌లు చాలానే ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ మానసిక ఒత్తిడి నుంచి, ఒంటరి అనే భావన నుంచి బయటపడొచ్చు. వీటితోపాటు మైండ్‌ఫుల్‌నెస్ పద్దతులను పాటించాలి. దీని కోసం కోసం టెక్నాలజీ అందుబాటులో ఉంది. వివిధ యాప్‌లు వెబ్‌సైట్‌లు గైడ్ చేసినట్టుగా యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు రోజూ చేయాలి.  


వీటితోపాటు డిజిటల్ యుగంలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సవాళ్లు అధిగమించేందుకు అనేక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ టైమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యకరమైన పద్దతులు పాటిస్తే కుంగుబాటు లాంటి మానసిక రుగ్మతలు లేకుండా ఉండొచ్చు.