హిళల్లో ఏర్పడే రుతుక్రమం లేదా బహిష్టు.. మూడు రోజులపాటు నరకం చూపిస్తుంది. రక్తస్రావం వల్ల ఆ మూడు రోజులు చాలా బలహీనంగా ఉంటారు. కనీసం పనులు చేసేందుకు కూడా ఓపిక ఉండదు. అలాంటి సమయంలో వారికి విశ్రాంతి అవసరం. కానీ, అది వారికి సాధ్యం కాదు. ఆ రోజుల్లో కూడా పనులన్నీ చక్కబెట్టాలి. ఈ క్రమంలో వారు తమ రుతక్రమం రోజున పాటించాల్సిన పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తారు. దాని వల్ల బాక్టీరియల్ వాజినైటిస్, ఈస్ట్ ఇన్‌ఫెక్షన్, యూరోజెనిటల్ ఇన్‌ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లకు గురవ్వుతారు. 


రుతుక్రమం రోజున చాలామంది సాధారణ క్లాత్‌ను ఉపయోగించడం మంచిది కాదు. పరిశుభ్రంగా శానిటరీ నాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు లేదా టాంపాన్‌లను మాత్రమే వాడాలి. ప్యాకింగ్ చేయని రుతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించరాదు. శానిటరీ నాప్‌కిన్‌లపై అవగాహనలేని గ్రామీణ ప్రాంత మహిళల్లో చాలామంది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్లకు గురై ఆస్పత్రిపాలవుతున్నారు. కాబట్టి, అవగాహన పొందడటంతోపాటు ఇతరులకు కూడా అవగాహన కలిగించాలి. 


సరైన రుతుక్రమ ఉత్పత్తులు ఉపయోగించండి: ఇటీవల మెన్‌స్ట్రువల్ కప్ వినియోగం బాగా పెరిగింది. ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైనది. దీన్ని బయటకు తీసి, ఖాళీ చేసి.. మళ్లీ లోపలికి చొప్పించుకుని ఉపయోగించవచ్చు. వీటిని మళ్లీ మళ్లీ వినియోగించవచ్చు. అయితే, శానిటరీ నాప్‌కిన్‌లతో అది సాధ్యం కాదు. అలర్జీలతో బాధపడేవారు తప్పకుండా శానిటరీ ప్యాడ్‌లు ఉపయోగించాలి. ప్రతి 6-8 గంటలకు ఒకసారి శానిటరీ నాప్‌కిన్‌లను మార్చాలి. తీసేసిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. ఏదైనా కవర్ లేదా పేపర్లలో చుట్టి డస్ట్ బిన్‌లో మాత్రమే పాడేయాలి. ఇటీవల ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. షాపుల్లో కొనుగోలు చేసే ప్యాడ్‌లతో దద్దుర్లు, దురద వస్తున్నట్లయితే.. ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లు ఉపయోగించండి.  టాంపోన్‌లను కూడా 8-10 గంటల్లో కంటే ఎక్కువ సేపు ఉపయోగించకూడదు. టాంపోన్ ఎక్కువసేపు ధరించడం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. 


Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!


మహిళలూ.. ఈ విషయాలు తెలుసుకోండి: 
❂ రుతుక్రమం గురించి మాట్లాడం తప్పుకాదు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ప్రతి స్త్రీలో ఏర్పడే సాధారణ ప్రక్రియ ఇది.
❂ పాఠశాల రోజుల నుంచే రుతుక్రమంపై పిల్లలకు అవగాహన కలిగించాలి. 
❂ 10-12 సంవత్సరాల వయస్సులో గల బాలికలకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
❂ ఋతుక్రమం సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన పోషకాహారం, వ్యాయామాల గురించి చెప్పాలి.
❂ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం, పెల్విక్ వ్యాయామాలు, మెడిటేషన్ వంటివి నేర్పించాలి. 
❂ థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల కారణంగా క్రమరహిత రుతుక్రమం మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు.
❂ 3 నుంచి 6 నెలల కంటే ఎక్కువ రోజులు బహిస్టు క్రమరహితంగా ఉంటే తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
❂ ఒకసారి ఉపయోగించిన శానిటరీ నాప్‌కిన్ మళ్లీ ఉపయోగించకూడదు. 
❂ శానిటరీ నాప్‌కిన్‌లు పరిశుభ్రమైన ప్రాంతాల్లో మాత్రమే ఉంచాలి. 
❂ బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ శానిటరీ నాప్‌కిన్‌లు మీతో ఉంచుకోవాలి. 
❂ రుతుక్రమం సమయంలో యోనిని శుభ్రం చేయడానికి సబ్బులు లేదా ప్రత్యేక ఉత్పత్తులు అవసరం లేదు. నీరు సరిపోతుంది.
❂ యోనిని శుభ్రం చేసే ఉత్పత్తుల ఉచ్చులో పడకండి. వాటిలో రసాయనాలు pH బ్యాలెన్స్‌కు హాని కలిగిస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.


Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!