మతిమరుపు, చిత్త వైకల్యం ఈ సమస్యలను డెమెన్షియా అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొత్తగా చేసిన ఓ అధ్యయనంలో ఒంటరిగా ఉండే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. డెమెన్షియా రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం, స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం చేయాలని చెబుతోంది పరిశోధనా. ఈ అధ్యయనాన్ని రోమ్‌కి చెందిన విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించారు. ఇందలో పెళ్లికి, స్నేహానికి మతిమరుపుతో సంబందం ఉన్నట్టు తేలింది.
ఎవరిలో ఎక్కువగా వస్తుంది?
మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒంటరితనంతో బాధపడేవారు, డిప్రెషన్ కు చికిత్స తీసుకోకుండా వదిలేసే వారు, పరీక్షలు ఫెయిలయ్యే వారు, చెవుడు ఉన్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంటుంది. అధికంగా చెప్పుకుంటే చెవుడు ఉన్నా వారిలోనే త్వరగా దాడి చేస్తుంది. ఒంటరితనం కూడా మనిషికి అన్ని రకాలుగా కుంగదీస్తుంది.
పెళ్లితో సేఫ్
మతిమరుపు పెళ్లయిన వారితో పోలిస్తే ఒంటరిగా ఉండే వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ అధ్యయనం తేల్చింది. అల్జీమర్స్ సొసైటీ చెప్పిన ప్రకారం పెళ్లి కాని ప్రతి 100 మంది ఒకరికి కచ్చితంగా మతిమరుపు ఉంటోందని తెలిపారు. దీనికి ఒంటరితనం, బాధను పంచుకునే వ్యక్తి లేకపోవడం, లోలోపలే కుంగిపోవడం కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని దాదపు 6677 మందిపై నిర్వహించారు. మొదట్లో ఎవరికీ మతిమరుపు వ్యాధి లేదు. కొన్నేళ్లకు 220 మందకి ఈ సమస్య వచ్చింది. వారంతా ఒంటరి వారే.
ఒకప్పుడు 60 ఏళ్లు దాటితేనే మతిమరుపు వ్యాధి వచ్చేది. ఇప్పుడు అంతకన్నా ముందునుంచే వెలుగు చూడడం మొదలుపెట్టింది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.జ్ఞాపకశక్తిని కోల్పోవటాన్ని అల్జీమర్స్ (మతిమరుపు) అంటారు. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటూ బంధువులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటే దాన్ని డిమెన్షియా అంటారు. ఇది ఒకసారి వచ్చిందా మళ్లీ తిరిగి పోదు. సరైన చికిత్స లేదు. మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: క్యాబెజీ చికెన్ కర్రీ, ఆ రెండూ కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో
Also read: ఐస్‌క్రీముల్లో వాడే ఈ ద్రావకం ఎంత ప్రమాదకరమో తెలుసా?