ఐస్‌క్రీమ్ (Ice Cream) అంటే నచ్చనిది ఎవరికి? పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్‌క్రీమ్‌ను తినడానికి ఇష్టపడతారు. కానీ వాటి తయారీలో, నిల్వ ఉంచే పద్ధతుల్లో ఒక ప్రమాదకరమైన ద్రావకాన్ని వాడుతున్నారు. దాని పేరు ‘లిక్విడ్ నైట్రోజన్’ (Liquid Nitrogen). ఇది నైట్రోజన్ వాయువుకు ద్రవ రూపం. దీన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తారు. ఆహార ఉత్పత్తులను ఫ్రీజర్లో నిల్వ ఉంచేందుకు ముఖ్యంగా లిక్విడ్ నైట్రోజన్‌ను వినియోగిస్తారు. దీన్ని వాడకం 1800ల నుంచి ఆహార పరిశ్రమలో వినియోగించడం ప్రారంభించారు. రంగు, వాసన లేని ఈ ద్రవం ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది వేగంగా ఘనీభవిస్తుంది. అందుకే దీన్ని ఐస్‌క్రీముల తయారీలో వాడుతారు. అలాగే రకరకాల డెజర్ట్‌లు, కాక్ టెయిల్‌లు తెల్లటి పొగలు కక్కేలా కూల్‌గా చేసేందుకు కూడా దీన్ని వినియోగిస్తారు.హై ఎండ్ రెస్టారెంట్లు, బార్‌లలో దీన్ని వాడతారు.
Also read: గోధుమ నూడుల్స్‌కు బదులు వూడుల్స్, మధుమేహులు కూడా తినొచ్చు
ద్రవ నైట్రోజన్ మంచిదేనా?
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన ప్రకారం నైట్రోజన్ ద్రవంతో తయారైన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. లిక్విడ్ నైట్రోజన్ అధికంగా ఉపయోగించిన ఆహారం తరచూ తినడం వల్ల అంతర్గత అవయవాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. చర్మానికి కూడా మంచిది కాదు. ద్రవ నైట్రోజన్ నుంచి వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. లిక్విడ్ నైట్రోజన్ ను వాయు రూపంలోకి మార్చి ఐస్ క్రీములు, ఇతర ఆహార పదార్థాలు పొగలు కక్కేలా చేస్తారు. అలా పొగలు కక్కుతున్నప్పుడు తినకపోవడమే మంచిదని సూచిస్తోంది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.
Also read: నీరసాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే, తినడం తగ్గించుకోవడం మేలు
జాగ్రత్త...
నైట్రోజన్ వాయువును 63 డిగ్రీల కెల్విన్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చల్లారిస్తే ఘన రూపంలోని కూడా మారుతుంది. అదే 77.2 డిగ్రీల కెల్విన్ వద్ద వాయు రూపంలోకి మారుతుంది. ద్రవ నైట్రోజన్‌ను నేరుగా చర్మానికి తాకిస్తే గాయాలు అవుతాయి. శ్వాసనాళాలు, జీర్ణాశయంలో కూడా గాయాలు అవుతాయి. అదే వాయు రూపంలో ఉన్నప్పుడు చర్మానికి నేరుగా తాకితే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.