ప్రపంచంలో అధికంగా తినే ఆహారాల్లో నూడుల్స్ (Wheat Noodles) ఒకటి. పాస్తా, చౌమీన్, స్పాగెట్టి రూపాలలో కూడా నూడుల్స్ ను తింటారు. వీటన్నింటినీ తయారుచేసేది గోధుమలతోనే. అయితే నూడుల్స్ మధుమేహులు తినకూడదు. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 14.  అందుకే వాటిని తింటే డయాబెటిక్ వారికి ఆరోగ్యసమస్యలు వస్తాయి. అంతేకాదు గోధుమల్లో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. గ్లూటెన్ ఎక్కువ తీసుకుంటే అలెర్జీలు, కోపం కూడా పెరుగుతాయి, కాబట్టి గోధుమలతో చేసిన నూడుల్స్ ఎక్కువగా తినకూడదు. అందుకే నూడుల్స్‌కు బదులు  వూడుల్స్ (Woodles) ఎంట్రీ ఇచ్చాయి. 


ఏంటీ వూడుల్స్?
ఇవి వెజిటబుల్ నూడుల్స్. అంటే కొన్ని రకాల కూరగాయలతో వీటిని తయారు చేస్తారు. గోధుమలను కలపరు. దీనివల్ల వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు. ఇది నూడుల్స్ కు మంచి ప్రత్నామ్నాయంగా వచ్చాయి. తక్కుడ జీఐ విలువను కూడా కలిగి ఉంటాయి. వీటిని రోజూ తిన్నా ప్రమాదం ఉండదు. 


వేటితో తయారుచేస్తారు?
కీరాదోస: కీరాదోసతో చేసే వూడుల్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి. వీటిలో విటమిన్ ఎ, సి, కె అధికంగా ఉంటాయి. వీటి రుచి కూడా బావుంటుంది. ఇక ఈ వూడుల్స్ జీఐ విలువ కేవలం 1 మాత్రమే. 


క్యారెట్లు: బీటాకెరాటిన్ అధికంగా ఉండే కూరగాయ క్యారెట్. వీటితో తయారుచేసే వూడుల్స్ కూడా ఉన్నాయి. వీటి జీఐ లోడ్ 2. విటమిన్ ఇ ఇందులో అధికంగా ఉంటుంది. 


బీట్‌రూట్: ఫైబర్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం ఇది. బీట్‌రూట్ జ్యూస్, కూర తినలేని వారు వూడుల్స్ రూపంలో తినవచ్చు. వీటి జీఐ విలువ 4. 


దోసకాయ: దోసకాయలలో ఫైబర్, నీరు పుష్కలంగా ఉంటుంది. తింటే ఎంతో ఆరోగ్యం. దీని జీఐ విలువ 1. దీనితో తయారుచేసిన వూడుల్స్ తినడం ఎంతో ఆరోగ్యం కూడా. 


బ్రోకలీ: ఇందులో కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. దీంతో తయారు చేసే కాస్త ఖరీదైనా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీని జీఐ విలువ 1. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: నీరసాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే, తినడం తగ్గించుకోవడం మేలు


Also read: ఉక్రెయిన్లోనూ ఒక ఒడిశా ఉంది, మొన్నటి వరకు అదో అందమైన నగరం, ఫోటోలు చూడండి