Controling Diabaetes Tips : ఇంటిల్లిపాదీ కలిసి చేసుకుంటేనే అది పండుగ అవుతుంది. అయితే కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మధుమేహం ఉన్నవారు పండగల సమయంలో కాస్త దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫెస్టివల్ సమయంలో మనం తయారు చేసుకునే పిండివంటలు మధుమేహం ఉన్నవారికి అస్సలు మంచివి కాదు. కాబట్టి కాస్త దూరంగా ఉంటే తినాలనే కోరిక కంట్రోల్​లో ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే మీ కుటుంబంతో హాయిగా గడిపి.. మంచి ఫుడ్​ తీసుకునే ప్లాన్ ఇక్కడ ఉంది. కొన్ని స్మార్ట్, సింపుల్ చిట్కాలతో మీరు షుగర్ కంట్రోల్ చేసుకుంటూ.. ఫెస్టివల్​ ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. మీరు మీ ఫ్యామిలీతో స్వీట్​గా ఎలా గడపాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


లిమిటెడ్​గా..


దీపావళి అంటేనే స్వీట్స్. ఒకటా.. రెండా ఎన్నో రకాల స్వీట్లు కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీరు తినాలనే కోరికను చంపుకోకుండా.. జస్ట్ టేస్ట్​ చూడొచ్చు. బాగున్నాయి కదా అని అతిగా తినేస్తే అసలకే మోసం అవుతుంది. కాబట్టి తక్కువగా తినడంపై దృష్టి పెట్టండి.


అంతేకాకుండా.. మీ భోజన సమయాల మధ్య కాస్త గ్యాప్ తీసుకోండి. ఇది మీరు తీసుకున్న ఆహారం జీర్ణమవ్వడానికి సహాయం చేస్తుంది. ఫుడ్ తీసుకున్న తర్వాత.. పడుకోకుండా.. లేచి అటూ ఇటూ తిరగండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో మాట్లాడండి. ఈ చిన్ని పనులు కూడా మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. 


హెల్తీ స్నాక్స్


మీ మీల్స్​కి మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే.. నట్స్, పెరుగు వంటి హెల్తీ స్నాక్స్ తీసుకోండి. అప్పుడు కూడా స్వీట్స్ తిన్నారనుకోండి అంతే సంగతులు. మీ ఆరోగ్యం విషమించే ప్రమాదముంది. కాబట్టి స్వీట్స్, డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అవుతాయి. స్నాక్స్​గా బాదం, వాల్​నట్స్ తీసుకోవచ్చు. లేదంటే మఖానేతో ఏవైనా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. 


వాటిని మరచిపోవద్దు..


పండుగ సమయంలో హడావిడిగా ఉండటం కామన్. అయితే మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు తీసుకోవాల్సిన మందులు, ఇంజెక్షన్లను మాత్రం తీసుకోవడం మరచిపోకండి. వీటిని మీకు టైమ్​కి అందించే వ్యక్తులు ఉంటే పర్లేదు. లేదంటే మొబైల్​లో రిమైండర్స్​ పెట్టుకోండి. ఇది మీరు సమయానికి మందులు తీసుకునేందుకు సహాయం చేస్తుంది. 


చక్కెర స్థాయిలు చెక్ చేయండి


పండుగ సమయంలో మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని మీ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు తినే ఆహారంపై మీకు తెలియకుండానే కంట్రోల్ వచ్చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ మోతాదును సర్దుబాటు చేసుకునే అవకాశముంది. 


హోమ్ మేడ్ స్వీట్స్..


స్వీట్ క్రేవింగ్స్ తగ్గించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు స్వీట్లకు చాలా దూరంగా ఉంటారు. పండుగల సమయంలో మాత్రం స్వీట్స్ ఘుమఘుమలు మరింత టెంప్ట్ చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. కాస్త స్వీట్ తగ్గించుకుని లేదా స్వీట్స్​కు ప్రత్యామ్నాయంగా స్వీటనర్స్​ ఉపయోగించి వంటలు తయారు చేసుకుని పండుగను ఆస్వాదించవచ్చు. పైగా మీరు ఇంట్లోనే వండుకుంటే.. షుగర్, కార్బోహైడ్రేట్, కేలరీలు కౌంట్ మీకు తెలుస్తుంది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఈ పండుగను మీరు కూడా స్వీట్​గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. 


Also Read : దీపావళి స్పెషల్ టేస్టీ కొబ్బరి పాయసం.. రెసిపీ చాలా సింపుల్


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.