పెట్రోల్ బంక్‌లో ఉన్నప్పుడు మొబైల్ మాట్లాడకూడదు, నిప్పు అంటించకూడదని చెబుతారు. కానీ, ఈ వీడియో చూసిన తర్వాత.. అపరిచితులతో జాగ్రత్త అనే బోర్డు కూడా పెట్టుకోవాలి. ఎందుకో తెలియాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.


చైనాలో ఓ జంట తమ పోర్స్చే(Porsche) కారులో పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పంపును కారు ఇంధన ట్యాంక్‌లో పెట్టిన తర్వాత ఓ వ్యక్తి.. అకస్మాత్తుగా అక్కడికి వచ్చి పెట్రోల్ పంపును బయటకు లాగాడు. ఆ తర్వాత పెట్రోల్‌ను కారుపై వేసి లైటర్ వెలిగించాడు. అంతే.. ఒక్కసారే కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని గుర్తించగానే ఆ కారు ఓనర్.. లోపల ముందు సీట్లో కూర్చున్న మహిళను బయటకు లాగి దూరంగా పరిగెట్టాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 


Also Read: ఓ మై గాడ్.. గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయాడు, చివరికి..


సీసీటీవీలో రికార్డైన వీడియోలు ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు కారుకు ఎందుకు నిప్పు అంటించాడనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు ముందు నిందితుడు కారు వద్దే నిలుచుని ఉండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి.. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇంధనం  నింపే సమయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే.. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. 


Viral Videoను ఇక్కడ చూడండి: 



Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..