పిజ్జాలు, బర్గర్లు తింటే బరువు పెరిగిపోతామనే భయం చాలామందిలో ఉంటుంది. అంతేకాదు, డాక్టర్లు కూడా వాటికి దూరంగా ఉండమని చెబుతుంటారు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం బర్గర్లు మాత్రమే తింటూ సన్నబడ్డాడట. రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా 57 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాయడట. దీంతో పరిశోధకులు అతడు ఒక ఐటెమ్‌గా మారిపోయాడు.


క్రిస్ అనే బ్రిటీష్ పౌరుడు తన బరువు తగ్గిన తీరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. కేవలం పోర్షన్ కంట్రోల్ మాత్రమే కాదు.. ఎన్ని క్యాలరీలు మనం వినియోగిస్తున్నామనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని క్రిస్ తెలిపాడు. ‘‘నేను ఫాస్ట్ పూడ్ ప్రియుడిని. ప్లేటు నిండా నాకు నచ్చిన ఆహారాన్ని పెట్టుకుంటాను. కడుపు నిండిన భావన కలిగిన వెంటనే.. తినడం ఆపేసేవాడిని’’ అని తెలిపాడు.


అయితే, ఫిట్‌‌గా ఉండటం కోసం నార్మల్ కంటే తక్కువ తినాలని.. తనకు తాను చెప్పుకుంటూ ఉంటానని, ప్లేటులో తక్కువ ఆహారాన్ని పెట్టుకుని, ఇంకా ఆకలిగా ఉంటే మరికాస్త వడ్డించుకుంటగానని తెలిపాడు. ‘‘మీరు కూడా మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. ముందుగా కాస్త తక్కువగా పెట్టుకోండి. ఆ తర్వాత మరికాస్త పెట్టుకోండి. అంతేగానీ.. ప్లేటు నిండుగా ఆశతో ఎక్కువ ఆహారాన్ని పెట్టుకుని మొత్తం తినేయాలని ప్రయత్నించకండి’’ అని పేర్కొన్నాడు.


కడుపు నిండిందని శరీరానికి సంకేతాలు పంపేందుకు మెదడుకు దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి భోజనం హడావిడిగా చెయ్యడం వల్ల ఎక్కువగా తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కాస్త సమయం తీసుకుని నెమ్మదిగా భోజనం చెయ్యాలని కూడా క్రిస్ తెలిపాడు. మనసుకు నచ్చినట్టుగా తింటూ కూడా అతడు తాను అనుకున్న శరీర బరువుకు చేరుకోవడానికి దాదాపుగా రెండున్నర సంవత్సరాల సమయం పట్టిందట. బరువు తగ్గేందుకు షార్ట్ కట్స్ ఎంచుకోవడం ఎప్పుడూ మంచిదికాదని, కేవలం బరువుతగ్గాలన్న అంకితభావం, కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు, నియమాలు, తగినంత వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన శరీరం సాధ్యమవుతుందని కూడా అతడు తన పోస్ట్ ద్వారా వివరించాడు. పాత పద్ధతుల్లో బరువు తగ్గడం వల్ల మాత్రమే శరీర బరువు స్థిరంగా ఉంచుకోవడం సాధ్యమనేది అతడి అభిప్రాయం.


పోర్షన్ కంట్రోల్ ఎలా చెయ్యాలి?



  • ఎప్పుడూ భోజనానికి చిన్న ప్లేట్ వాడడం మంచిది. ఎందుకంటే పెద్ద ప్లేట్ లో ఆహారం తక్కువగా ఉన్నభావన కలిగిస్తుంది. కనుక ఎక్కువ వడ్డించుకునే ప్రమాదం ఉంటుంది.

  • కార్బోహైడ్రేట్లను తక్కువ తీసుకోవాలి.

  • వంట చేసే సమయంలో మెజరింగ్ కప్స్ వాడాలి.

  • మిగిలిపోయిన వాటి గురించి ఆలోచించొద్దు.

  • షాపింగ్ చేసే సమయంలో ఫూడ్ లేబుల్స్ తప్పక చదవాలి.

  • తినడం మొదలు పెట్టేందుకు ముందే ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది.


  • డైరెక్టగా కంటైనర్ నుంచి తీసుకుని తినకూడదు. ప్లేటులో వడ్డించుకున్న తర్వాత మాత్రమే ఆహారం తినాలి.


    Also read : బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేస్తున్నారా? డయబెటిస్ బారిన పడొచ్చు జాగ్రత్త


    గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


    ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



    Join Us on Telegram: https://t.me/abpdesamofficial