సోషల్ మీడియా అనేది సాదాసీదా అలవాటు కాదు.. ఒక పెద్ద వ్యసనం. రోజుకు కనీసం పదిసార్లు చెక్ చేస్తేగానీ నిద్రపట్టదు. ఇందులోకి ఒక్కసారిగా వెళ్తే.. అంత ఈజీగా బయటకు రాలేరు. సోషల్ మీడియా వల్ల కొన్నిసార్లు మేలే జరుగుతుంది. కానీ, అన్నిసార్లు కాదు. దానివల్ల సమయం, ఆరోగ్యం రెండూ నాశనమవుతాయి. అందుకే ఓ వ్యక్తి ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కొత్తగా ఆలోచించాడు. అతడు పొరపాటున ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే ఫేస్ పగలగొట్టేందుకు ఓ యువతిని అపాయింట్ చేసుకున్నాడు. అతడు చెప్పినట్లే.. ఆ అమ్మాయి అతడి చెంప పగలగొడుతూ ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తన ఉద్యోగాన్ని ఎంతో సిన్సియర్‌గా చేస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కో బ్లాగర్ మనీష్ సేథీకి వచ్చిన ఐడియా ఇది. ఇటీవల అతడు కారాను యువతికి ఉద్యోగం ఇచ్చాడు. అనంతరం ఆమెకు ‘స్లాపర్’ అనే ఓ చిత్రమైన బాధ్యత అప్పగించాడు. అతడు పొరపాటున ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే.. చెంప పగలగొట్టడం ఆమె ఉద్యో్గం. ఎందుకంటే.. నిత్యం సోషల్ మీడియాతో టైంపాస్ చేయకుండా బిజినెస్ మీద ఫోకస్ పెడితేనే డెవలప్ అవుతానని అతడు తెలుసుకున్నాడు. ఇందుకు ఇదే తగిన మార్గమని భావించాడు. రోజుకు 6 గంటల సేపు ఆమె తన డ్యూటీ చేస్తుంది. అతడు ఫేస్‌బుక్, రెడిట్ చూస్తే చెంప పగలగొడుతుంది. ‘పెయిన్ ఫర్ గెయిన్’ అన్నట్లుగా జీవితంలో ఏదైనా సాధించాలంటే నొప్పిని భరించాల్సిందేనని మనీష్ తెలిపాడు. కాబట్టి మీరు కూడా ఇలా చేయండని సలహా ఇస్తున్నాడు. చిత్రం ఏమిటంటే దీన్ని ప్రపంచదిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల అధినేత ఎలన్ మస్క్‌కు కూడా ఇతని ఐడియా నచ్చేసింది. సెథికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ఎలన్ మస్క్ రీట్వీట్ చేశారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి