Dragon Fish | నోటి నుంచి నిప్పులు కక్కే డ్రాగన్ గురించి మీకు తెలిసిందే. అయితే, అవి కేవలం కల్పితం మాత్రమేనని చాలామంది భావిస్తారు. కానీ, ప్రాచీన కాలంలో డ్రాగన్లు ఉనికిలో ఉండేవని చెబుతుంటారు. చైనీయులు ఎక్కువగా డ్రాగన్లను విశ్వసిస్తారు. వాటిని దైవంగా భావిస్తారు. పౌరాణిక గాధల్లో డ్రాగన్లు తప్పకుండా ఉంటాయి. డ్రాగన్లు ఇప్పటికీ వారి సంస్కృతిలో భాగమే. అయితే, అతరించిపోయిన అతి భయానక జాతుల్లో డ్రాగన్లు కూడా ఉన్నాయి. అవి నేలపైనే కాకుండా గాల్లో ఎగరగలవు. నీటిలో ఈదగలవు. అందుకే, వాటిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాచీన జంతువుగా భావిస్తారు. 


తాజాగా రోమన్ ఫెడోర్ట్సోవ్ అనే జాలరి నార్వే సముద్రంలో చేపలను పట్టేందుకు వెళ్లగా.. అతడి వలలో ఓ వింత జీవి చిక్కుకుంది. లేత గులాబీ రంగులో.. భారీ కళ్ళు, పొడవాటి తోక ఉన్నాయి. అంతేకాదు.. దానికి రెక్కలు కూడా ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత రోమన్, అతడి సహచరులకు నోట మాట రాలేదు. దాని ఆకారం చూసి అంతా దాన్ని ‘బేబీ డ్రాగాన్’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతానికైతే దాన్ని ఇంకా చేపగానే భావిస్తున్నారు. 


Also Read: భలే ఉద్యోగం, పోర్న్ చూస్తే గంటకు రూ.1500 జీతం, మీరూ ధరఖాస్తు చేయొచ్చు!


రోమన్ ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని నెటిజనులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇది చేపలా లేదని, నిజంగానే డ్రాగన్ కావచ్చేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిపుణులు మాత్రం దీన్ని చేప అనే అంటున్నారు. మృదులాస్థి కలిగిన ఈ చేపను ‘ఘోస్ట్ షార్క్స్’ అని కూడా పిలుస్తారని తెలుపుతున్నారు. రోమన్‌కు ఇలాంటి అరుదైన చేపలు చిక్కడం ఇదే తొలిసారి కాదు. తాను చూసే ప్రతి వెరైటీ చేపకు ఫొటో తీసి.. ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాడు. అయితే, అన్నిటి కంటే ఈ డ్రాగన్ చేపకే ఎక్కువ లైక్స్ వచ్చాయి. సముద్రంలోని లోతైన చీకటి ప్రాంతాల్లో మరిన్ని వింత చేపలు జీవిస్తాయని తెలుసుకుని అతడు ఎన్నో పర్యాటనలు చేశాడు. తాను పట్టిన అత్యంత ప్రమాదక చేపల్లో ‘క్యాట్ ఫిష్’ ఒకటని రోమన్ చెప్పాడు. ఎందుకంటే.. అది చాలా గట్టిగా కొరుకుతుందట. రబ్బరు బూట్లను సైతం ముక్కలను చేసే సామర్థ్యం క్యాట్ ఫిష్‌కు ఉందట. మరో చిత్రం ఏమిటంటే.. ఈచేప చనిపోయినట్లు నటించి శత్రువుపై దాడి చేస్తుందట.


Also Read: గ్రహాంతరవాసులు ఘటికులే - భూమిపై లైంగిక సంబంధాలు, ఒకరు గర్భవతి కూడా, అమెరికా వెల్లడి!