ఫీసు వేళల్లో అశ్లీల వీడియోలు (పోర్న్) చూడటం ఎంత రిస్కో మీకు తెలిసిందే. ఇలాంటి పాడుపనులను ఏ కంపెనీ కూడా ప్రోత్సాహించదు. ఒక వేళ అవి చూస్తూ పట్టుబడ్డారంటే ఇక ఉద్యోగం మీద ఆశలు వదిలేసుకోవల్సిందే. అయితే, ఓ కంపెనీ మాత్రం మీరు రోజంతా పోర్న్ చూడండి.. మాకేమీ అభ్యంతరం లేదని అంటోంది. అంతేగాక ప్రతి గంటకు 15 పౌండ్లు (రూ.1489) చొప్పున జీతాన్ని చెల్లిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో కుర్రాళ్ల ఆనందానికి అవధులే లేవు. పోర్న్ చూడటంలో తమకున్న అనుభవాన్ని అర్హతగా చూపిస్తూ ఈ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకుంటున్నారు. పైగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home - WFH) కావడంతో ఈ ఉద్యోగాన్ని ఎక్కడి నుంచైనా చేయొచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యోగానికి డిమాండ్ బాగా పెరిగింది. అన్నట్లు ఈ జాబ్‌కు మీరు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, మన ఇండియాలో పోర్న్ బ్యాన్ కాబట్టి.. ఆశలు పెట్టుకోకపోవడమే బెటర్. 


ఏం చేయాలి?: అశ్లీల వీడియోలను చూడటం కూడా ఒక కళ అని బెడ్‌బిబుల్‌ (Bedbible) అంటోంది. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే వ్యక్తి ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూడటమే కాకుండా అందులోని సమాచారాన్ని సేకరించాలి. అదేంటీ, అందులో తెలుసుకోవలసిన సమాచారం ఏమిటీ? మరీ చిలిపి కాకపోతే అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్టు. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు మీరు చాలా అంశాలను అబ్జర్వ్ చేయాలి. ఆ వీడియోలోని శృంగార భంగిమలు, ఎంత సేపు చేస్తున్నారు, వారి జుట్టు రంగు, ఆ వీడియోలోని పాత్రలు భావప్రాప్తి పొందేందుకు పట్టిన సమయం వంటి అంశాలపై లోతైన అధ్యయనం జరిపి, ఆ నివేదికను Bedbible.comకు అందించాలి. ఉద్యోగి చూడాల్సిన వీడియోల లింకులు కూడా ఆ సంస్థే అందిస్తుంది. 


అర్హతలు ఇవే: ఈ జాబ్ టైటిల్ ‘హెడ్ ఆఫ్ పోర్న్ రీసెర్చ్’. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు కంటే ఎక్కువ ఉండాలి. ఈ పని ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే పనిచేయొచ్చు. దరఖాస్తుదారులు Bedbible.com వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ ఫారమ్‌ పూర్తి చేయాలి. పేరు, ఇమెయిల్, ప్రస్తుత ఉద్యోగం తదితర వివరాలు ఇవ్వాలి. అలాగే మీరు ఈ ఉద్యోగానికి మీరు ఏ విధంగా అర్హులు, ఎందుకు దరఖాస్తు చేసుకున్నారనే యక్ష ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాలి. స్థితి వంటి కొన్ని సాధారణ వివరాలను అందించమని మిమ్మల్ని అడగడంతోపాటు మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి మరియు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారో వివరించండి. సంస్థ కంటెంట్ హెడ్ ఎడ్వినా కైటో మాట్లాడుతూ.. ‘‘అశ్లీలత అనేది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ పౌండ్ల వ్యాపారం. దీని గురించి మేం మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రపంచంలో ట్రెండవ్వుతున్న టాప్ 100 వీడియోలను పరిశీలించి ప్రజల అభిరుచులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. 


Also Read: గ్రహాంతరవాసులు ఘటికులే - భూమిపై లైంగిక సంబంధాలు, ఒకరు గర్భవతి కూడా, అమెరికా వెల్లడి!


ఇటీవల IT సపోర్ట్ కంపెనీ టోటాలిటీ సర్వీసెస్ 2,000 మందిపై జరిపిన సర్వేలో ఐదు శాతం మంది ఆఫీసులు కేటాయించిన ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీక్షిస్తున్నట్లు అంగీకరించారట. రోజులో కనీసం 4 నుంచి 8 గంటల సేపు పోర్న్ వీక్షించేవారు కూడా ఉన్నారట. అయితే, అంతా అదే పనిలో ఉంటున్నారని అనుకుంటే పొరపాటే. 8 శాతం మంది తమ ఆఫీస్ ల్యాప్‌టాప్‌ల్లో గేమ్స్ ఆడుతున్నట్లు, 11 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌లో బిజీగా ఉంటామని చెప్పారు. 10 శాతం మంది వారు సినిమాలు చూస్తామని చెప్పారు. ఐదు శాతం మంది బెట్టింగ్‌తో తదితర జూదాలకు ల్యాప్‌టాప్ వాడుతున్నామని చెప్పారు. 


Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?