Makeup Tips for All Skin Types : మీకు ఇష్టమైన బ్యూటీ ఇన్ఫ్లూయెన్స్రను చూసి.. వారిలాగే మేకప్ వేసుకుని.. రిజల్ట్ వారిలా రావాట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారని అర్థం. అవును మీ చర్మం రకం ఏంటో తెలుసుకుని.. మీ స్కిన్ ఎలా ఉందో చూసి అప్పుడు మేకప్ చేసుకోవాలి. అలాగే కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల మీరు వేసుకునే మేకప్ సెలబ్రెటీ లుక్‌ని ఇస్తుంది. అలాగే మీ స్కిన్ ఆయిల్, డ్రై, కాంబినేషన్ అనేది తెలుసుకోవాలి. అప్పుడు దానికి తగ్గట్లు ప్రొడెక్ట్స్ ఎంచుకోవడం.. దాని ప్రకారం మేకప్ వేసుకోవడం చేయాలి. మరి ఎలాంటి స్కిన్కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ఆయిల్ స్కిన్ కోసం మేకప్ చిట్కాలు (Oil Skin)
మీకు ఆయిల్ స్కిన్ ఉంటే క్రీమ్-ఆధారిత క్లెన్సర్ ఎంచుకుంటే మంచిది. మీ చర్మాన్ని డబుల్ క్లెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది చర్మంపై ఒత్తిడి లేకుండా ముఖం నుంచి మురికిని తొలగిస్తుంది. లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచిది. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్దా ఉంచుతుంది. అంతేకాకుండా జిడ్డు లేకుండా, మృదువుగా కనిపించేలా చేస్తుంది. సిలికాన్ బేస్డ్ ప్రైమర్‌ను ఉపయోగించాలి. ఇది అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. బ్లర్ టూల్‌గా కూడా పనిచేస్తుంది. రంధ్రాలు, ఫైన్ లైన్స్ కవర్ చేస్తుంది.
ఆయిల్ స్కిన్ ఉండేవారు బేస్ కోసం మ్యాట్, తేలికైన, ఎక్కువ కాలం ఉండే ఫౌండేషన్‌ను ఉపయోగించాలి. క్రీమ్ కాంటౌర్, బ్లష్, లిక్విడ్ హైలైటర్లకు బదులుగా.. బేస్‌ను మెరుగుపరచడానికి తేలికపాటి, మృదువైన పౌడర్ బ్లష్, కాంటౌర్, హైలైటర్ ఉపయోగిస్తే మంచి లుక్ ఉంటుంది.
డ్రై స్కిన్ వారు ఫాలో అవ్వాల్సిన మేకప్ టిప్స్ (Dry Skin)
పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్‌గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్‌ని హైడ్రేటింగ్ బేస్‌గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.
కాంబినేషన్ స్కిన్ కోసం మేకప్ చిట్కాలు (Combination Skin)
మీకు కాంబినేషన్ స్కిన్ ఉంటే చర్మాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. మేకప్ వేసుకునే ముందు చర్మానికి తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. నీటి ఆధారిత ఫార్ములాలు లేదా మాయిశ్చరైజింగ్ జెల్స్ రాసుకోవాలి. ఎందుకంటే అవి జిడ్డుగా ఉండవు. అలాగే చర్మంలో త్వరగా కలిసిపోతాయి. రెండు వేర్వేరు రకాల ప్రైమర్‌లను వాడండి. ముఖంలోని పొడి భాగాల వద్ద నీటి ఆధారిత ప్రైమర్, టీ-జోన్ కోసం మాయిశ్చరైజింగ్ ప్రైమర్ ఉపయోగించాలి. మ్యాట్ ఫినిష్‌తో ఫౌండేషన్‌ను ఉపయోగించాలి. కానీ మీ ముఖంపై పొడి మచ్చలు కనిపిస్తే హైడ్రేటింగ్ వెర్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
ఇలా మీ స్కిన్ కాంబినేషన్ గుర్తించి.. దానికి తగ్గట్లు మేకప్ ప్రొడెక్ట్స్ ఎంచుకోవాలి. దీనివల్ల మేకప్ లుక్ ప్రొఫెషనల్‌గా, మంచి ఫినిషింగ్‌తో వస్తుంది. అలాగే ఎప్పుడూ మేకప్ చేసుకున్నా మేకప్‌ని సెట్టింగ్ స్ప్రేతో సెట్ చేసుకుంటే లుక్ ఎక్కువసేపు మంచిగా ఉంటుంది.