Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర భూమిని గగన్ ఇంట్లో వదిలి వేసి వెళ్లిపోయాక శారద, భూమిని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. వెంటనే గగన్ కోపంగా ఆగండి అంటాడు. శారద ఆశ్చర్యంగా ఆగిపోయి గగన్ వైపు చూస్తుంది.
గగన్: ఎక్కడికి అమ్మా తనని తీసుకెళ్తున్నావు.
శారద: అదేంటి నాన్నా అలా అంటున్నావు.. తాళి కట్టిన వాడి ఇంటిలోనే కదా తనకు స్థానం ఉండేది.
గగన్: నేను తాళి కట్టలేదు..
భూమి: లేదు అత్తయ్యా ఆయనే ఈ తాళి కట్టారు. బావ ఇది మీరు కట్టిన తాళే..
గగన్: శరత్ చంద్ర అనే వెర్రి గొర్రెకు చెప్పు వాడు నమ్ముతాడు. నేను కాదు.. తాళి తాళింపు అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టావా..?
భూమి: చూడండి బావ ఎలా మాట్లాడుతున్నాడో.. ఏ ఆడదైనా ఒక మగాడి ముందు కట్టని తాళిని కట్టాడు అని చెప్పగలదా..?
శారద: అవునురా.. తను చెప్తుంది నిజమే.. తన మెడలో ఉన్నది పసుపు తాడు. నీ చేతికి ఉన్నది పసుపు. దీని బట్టి నీకు అర్థం అవ్వడం లేదా..? నువ్వే తనకు తాళి కట్టావని
గగన్: అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా..? ఇలా మాట్లాడుతున్నావు..? నేనేమైనా పెళ్లికి వెళ్లానా..?
శారద: రాత్రి నువ్వు వెళ్లింది పెళ్లికి కాదు. బ్యాచిలర్ పార్టీకి.. నువ్వు రామ్మా లోపలికి వెళ్దాం..
గగన్: నో ఈవిడ లోపలికి అడుగుపెట్టడానికి వీల్లేదు.. దట్స్ మై ఆర్డర్.
శారద: ఓరేయ్ పుట్టింటి వాళ్లు వదిలేశార్రా..? అది కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావన్న ఒకే ఒక్క కారణంతో
గగన్: అమ్మా నీకు అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకోలేదు.. నాకు అసలు పెళ్లే జరగలేదు. చేసుకునే పెళ్లే అయితే ఎప్పుడో పీటల మీదే అయిపోయేది. అప్పుడు నాటకం ఆడి పెళ్లి ఆపేసింది.
అంటూ కోపంగా గగన్ కూడా భూమిని ఇంట్లోకి రానివ్వడు. దీంతో భూమి బయటే నిలబడి ఉంటుంది. ఇంతలో వర్షం వస్తుంది. అయినా పట్టించుకోకుండా భూమి బయటే నిలబడి వర్షంలో తడుస్తూ ఉంటుంది. ఇంతలో రాత్రి అవుతుంది. గగన్ వాళ్లు అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు చూసినా భూమి వానలో తడుస్తూనే ఉంటుంది. శారద వడ్డిస్తూ భూమి వైపు చూస్తుంది. శివ, పూర్ణి తినకుండా బాధగా అలాగే కూర్చుని ఉంటారు. గగన్ మాత్రం అన్నం తింటుంటాడు.
శారద: నాన్న గగన్ ఉదయం నుంచి భూమి బయట అలాగే నిలబడి ఉందిరా..?
గగన్: కాళ్లు నొప్పి పుడితే తనే వెళ్లిపోతుందిలే అమ్మా.. నువ్వేం వర్రీ అవ్వకు
శారద: అది కాదురా..? ఎంతైనా తను నీ భార్యరా..
అని చెప్పగానే గగన్ కోపంగా శారదను చూస్తాడు. మీరు ఎవరూ భోజనం చేయరా… అంటూ అడగ్గానే శివ, పూర్ని పలకరు దీంతో గగన్ భోజనం చేసి పైకి వెళ్లిపోతాడు. కింద శారద, పూర్ణి, శివ ఏడుస్తూ బయట వానలో తడుస్తున్న భూమిని చూస్తుంటారు. పైకి వెళ్లిన గగన్ పడుకుని నిద్ర పట్టక లేచి కిందకు కిటికీలోంచి చూస్తాడు. భూమి అలాగే వానలో తడుస్తూ ఉంటుంది. దీంతో గగన్ కిందకు వెళ్తాడు. ఏడుస్తూ భూమిని చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!