Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు, వేదవతి, చిన్న కూతురు అమూల్య బయట కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు. భద్రావతి బయట నిల్చొని నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న రామరాజుని చూసి మా ఇంట్లో నవ్వులు దూరం అవ్వడానికి మీ ఇంట్లో నవ్వులు ఇక్కడి వరకు రావడానికి కారణ నువ్వేరా అని బాధగా ఏడుస్తుంది. ఇంతలో విశ్వ వచ్చి ఏమైంది అత్త ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే నా బాధ, నా ఏడుపు ఇప్పుడిది కాదురా పాతికేళ్లగా ఏడుస్తూనే ఉన్నాను.. నా చెల్లి దూరం అయింది..ఇప్పుడు నా మేన కోడలు దూరం అయింది అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది.
విశ్వ అత్తతో మనం పోయే వరకు మన బాధ పోదు అత్త.. ఆ రామరాజు మీద పగ తీర్చుకునేలా మనం ఏం చేయలేం అని అంటాడు. దానికి భద్రావతి నువ్వు చెప్పింది నిజమేరా వాడిని ఆ రోజు శిక్షించకుండా నేను తప్పు చేశాను.. అందుకే మనం ప్రేమని దూరం చేసుకున్నాం.. వాడు అక్కడ నవ్వుకుంటే మనం బాధ పడుతున్నాం.. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.. అందుకు నువ్వు ఒకటి చేయాలి.. ఆ రామరాజు చిన్న కూతురు అమూల్యని నువ్వు పెళ్లి చేసుకోవాలి.. దాన్ని పెళ్లి చేసుకోమన్నది వాడిని నువ్వు కాపురం చేయడానికి కాదురా.. మనం పడుతున్న బాధ వాడు పడటానికి.. అది మన ఇంట్లో పెట్టే కన్నీళ్లు, అది మన ఇంట్లో పడే బాధ వాడు చూడలేక వాడు గుండె పగిలి చావాలి.. అప్పుడు వాడికి మన బాధ అర్థమవుతుంది. ఆ ధీరజ్ మన ప్రేమని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నట్లే నువ్వు కూడా ఆ అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకో అని చెప్తుంది. విశ్వ సరే అంటాడు.
ప్రేమ డల్‌గా కూర్చొని కల్యాణ్ గురించి ఆలోచిస్తుంటే వేదవతి, నర్మదలు చూసి ప్రేమలా కూర్చొని ఆకాశంలో ఎన్ని నక్షిత్రాలు ఉంటాయి. మన ప్రేమ చందమామలా ఉంటుందని ఆ చందమామ కిందకి రాదు.. వెన్నెల కూడా భయపడిపోతుంది అని ప్రేమని అత్తా కోడళ్లు నవ్వించేస్తారు. రెండు రోజులుగా చూస్తున్నా ఏదో బాధ పడుతున్నావ్ ఏమైంది.. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఏమైందో చెప్పు అని అడుగుతారు. మేనత్త అంటే అమ్మ కంటే ఎక్కువ మరి నీ బాధ ఈ అమ్మకి చెప్పకపోతే ఎలా చెప్పు అని వేదవతి అడుగుతుంది.
ప్రేమ ఏం చెప్పకుండా పక్కకి వెళ్లిపోతే నర్మద వెళ్లి బాధ అయినా కన్నీరు అయినా త్వరగా దించేయకపోతే ఆ బాధ నరకం కంటే ఎక్కువ అయిపోతుంది ఏమైందో చెప్పు అని అడుగుతుంది. ప్రేమ మనసులో ఈ రోజు నేను ప్రాణంతో ఉన్నాను అంటే అది మీ వల్లే.. నా ప్రతీ బాధ, కష్టం మీకు చెప్పుకోవాలి కానీ మీకు చెప్తే మా మయ్య దృష్టిలో మరోసారి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నావల్ల మీరు మరోసారి బాధ పడకూడదు అని అనుకుంటుంది. నాకేం బాధలు లేవు.. ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా.. అంటే అన్నాను అంటారు కానీ ఈ మనుషులకు మహా కంగారు సుమీ అని నవ్వించేస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని వేదవతి ప్రేమని పట్టుకొని ముద్దాడుతుంది. నర్మద కూడా ప్రేమని హగ్ చేసుకుంటుంది.
రామరాజు లెక్కలు చూసుకుంటే వల్లీ తొంగి తొంగి చూస్తుంటుంది. ఇద్దరూ భలే దొరికేశారు.. ఇద్దరి సంగతి మామయ్యకి చెప్పేసి ఇక నా ముందు తల ఎగరేయకుండా కొమ్ములు విరిచేస్తా అని అనుకుంటూ రామరాజుకి చెప్పాలని వెళ్తుంది. అంతలోనే పక్కా సాక్ష్యాలతో నిరూపించాలని అనుకుంటుంది. నర్మద తల రుద్దుకుంటూ ఉంటే సాగర్ వచ్చి నీ నవ్వుల తెల్లదనాన్ని జాజిమల్లీ అప్పడిగింది అని పాటలు పాడుతూ నర్మదని హగ్ చేసుకుంటాడు. ఇక టవల్ ఊడిపోయింది జాగ్రత్త అని నర్మద గాలి తీసేస్తుంది. సాగర్ సిగ్గుతో పారిపోయి మళ్లీ డ్రస్ మార్చుకొని వచ్చి ఒక్కటి ఇవ్వు అని ముద్దు అడిగితే నర్మద చెంప మీద ఒక్కటిస్తుంది. ఇద్దరూ గదిలో రొమాన్స్‌లో ఉంటూ చెరో డోర్ పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంతలో వల్లీ వచ్చి డోర్ తీస్తుంది. సాగర్ సిగ్గుతో ముఖం తిప్పుకుంటాడు. సారీ డిస్ట్రబ్ చేశాను అని నర్మదతో మాట్లాడాలి అని అంటుంది. సాగర్ ఇప్పుడే మాట్లాడాలా.. ముద్దు గోవింద అని మాట్లాడుకోండి అని వెళ్లిపోతాడు. వల్లీ సాగదీస్తూ సాగర్ పరీక్ష రాశాడు కదా అని అడుగుతుంది. నర్మద షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.