నం అందంగా కనిపించాలంటే.. ముఖం ఒక్కటీ బాగుంటే సరిపోదు. జుట్టు కూడా బాగుండాలి. జుట్టు ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా, అది ఊడిపోయిన తర్వాత ‘అయ్యో పోయిందే’ అని ఫీలవడం కంటే.. ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా చుండ్రు విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. పైగా చుండ్ర రాలే జుట్టుతో.. ఎప్పుడు తలగోక్కుంటూ తిరగడం కూడా బాగోదు. నిత్యం దురద వల్ల కొత్త సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి, చుండ్రు ఎందుకు ఏర్పడుతుంది? ఏ కారణాల వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందుగా తెలుసుకోవడం బెటర్. సొంత వైద్యానికి బదులు ముందుగా వైద్యుడిని సంప్రదిస్తే మీ సమస్యకు తగిన మందులిస్తారు. అలాగే, కొన్ని సాధారణ చిట్కాల ద్వారా కూడా చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.


చుండ్రు ఎందుకు ఏర్పడుతుంది?: చుండ్రు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. వైద్య పరిభాషలో చుండ్రును స్కాల్ఫ్ ఫ్లాకినెస్ అని అంటారు. ఎగ్జిమా లేదా సొరియాసిస్, సెబోరోహెయిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యల వల్ల ఎక్కువగా చుండ్రు ఏర్పడుతుంది. పొడిబారిన చర్మం వల్ల కూడా చుండ్రు ఏర్పడుతుంది. మీరు ఉపయోగించే కొన్ని జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వల్ల కూడా చుండ్రు ఏర్పడవచ్చు. వాటివల్ల ఏదైనా రియాక్షన్ ఏర్పడినప్పుడు తల దురదపెట్టి చుండ్రు ఏర్పడుతుంది. అధిక జిడ్డుగల చర్మం, మలాసెజియా వంటి అంటువ్యాధుల వల్ల కూడా చుండ్రు ఏర్పడే అవకాశం ఉంది. 


Also Read: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!


నివారణ మార్గాలు: చుండ్రును తేలికగా తీసుకోవద్దు. నిత్యం తల దురదపెడుతుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. చుండ్రు సమస్య దీర్ఘకాలికంగా వేదిస్తుంటే చర్మవ్యాధి నిపుణులు లేదా ట్రైకాలజిస్ట్‌ని కలవండి. ఎందుకంటే, చుండ్రు కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా లింకై ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకున్నా చుండ్రు ఏర్పడుతుంటే.. ఈ కింది టిప్స్ ట్రై చేయండి. 
☀ చుండ్రు సమస్య తగ్గడానికి యాంటీ డాండ్రఫ్ షాంపులను వాడండి.
☀ ఆపిల్ సైడర్ వెనిగర్, కలబంద, పెరుగును చుండ్రు నివారణను ప్రయత్నించవచ్చు.
☀ జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
☀ షాంపు పెట్టే ముందు జుట్టును నీటితో కడగాలి. 
☀ పొడి జట్టుకు నేరుగా షాంపూ పెట్టకూడదు. 


Also Read: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ప్రధాన లక్షణాలు ఇవే!


గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. వైద్యుల సూచన, సలహా తర్వాత ఈ టిప్స్ పాటించడం మంచిది.