మన చుట్టూ ఎన్నో రంగులు. ఒక్కొక్కరి కంటికి ఒక్కో రంగు నచ్చుతుంది.వేడుకలు, పండుగలప్పుడు మీకు నచ్చిన రంగు డ్రెస్సుల్లో మెరిసిపోవచ్చు. కానీ ఇంటర్య్వూకి వెళ్లినప్పుడు మాత్రం ఒక చక్కని డ్రెస్ కోడ్ అవసరం. చూడగానే నీట్ గా అనిపించాలి. ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. కంటికి ప్రశాంతంగా అనిపించాలి. మొదటి చూపులోనే మీపై మంచి అభిప్రాయం కలిగేలా చేసేది మీ ఆహార్యమే. ఇంటర్య్వూలో మీ వస్త్రధారణ కూడా మీకు ఉద్యోగం వచ్చేలా చేయడంలో ఎంతో కొంత సహకరిస్తుంది. ఏదైనా ఇంటర్య్వూకి వెళుతున్నప్పుడు కొన్ని మీరు మంచి అభిప్రాయం కలిగేలా చేస్తాయి.
నీలం రంగు
నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఇంటర్య్వూకి వెళుతున్నప్పుడు ధరించాల్సిన రంగుల్లో ఉత్తమమైన వాటిల్లో నీలం రంగు ఒకటి. నీలం రంగు చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు నమ్మదగినవారు, కష్టపడి పనిచేసేవారు అని అనిపించేలా చేస్తుంది. ఈ రంగు ధరించడం వల్ల జట్టులో ఆటగాడిగా అనిపిస్తారు.
బూడిద రంగు
బూడిదరంగు షర్టు లేదా డ్రెస్సు వేసుకుంటే తార్కికమైన ఆలోచనలు కల వ్యక్తిలా కనిపిస్తారు. చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. మీరు మంచి టేస్టు ఉన్న వ్యక్తిలా అనిపిస్తారు. ఎదిగే వ్యక్తిలా ఎదుటివారికి ఫీల్ కలుగుతుంది.
నలుపు
నలుపు రంగు దుస్తులు శుభకార్యాలకు అశుభంగా అనుకుంటారు కానీ, ఇంటర్య్వూలకు మాత్రం చక్కగా ఫిట్ అవుతాయి. శక్తిని, అధికారాన్ని, బలాన్ని, నాయకత్వ లక్షణాలను, పనిచేసే సామర్థ్యాన్ని నలుపు రంగు ప్రతిబింబిస్తుంది. హై పొజిషన్ ఇంటర్య్వూ కోసం వెళుతున్నప్పుడు నలుపు రంగులు ధరిస్తే మంచిది. అదే ఎంట్రీ లెవెల్ ఉద్యోగమైతే నలుపు రంగు దుస్తులు వద్దు.
తెలుపు
తెల్లటి దుస్తులు ఎప్పుడూ చక్కటి ఎంపికే. తెలుపు రంగు మీరు నిజాయితీపరులని, స్వచ్చమైన మనసు కలవారని తెలియజేస్తుంది. మీరు చక్కటి ప్రణాళికతోనే ముందుకు వెళతారని, గజిబిజి గందరగోళం ఉండదని ఎదుటి వారికి చెప్పకనే చెబుతున్నట్టు. తెల్లని దుస్తులు ఇంటర్య్వూ చేసేవారి కళ్లకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే అతడు లేదా ఆమె ప్రేమ నిజమైనదనే అర్థం
Also read: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు