ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు.. డయాబెటిస్ వ్యాధిపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. అది ఏయే కారణాల వల్ల వస్తుంది? కేవలం తీపి, పిండి పదార్థాలు తినడం వల్లేనా? లేదా ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా అతిగా మూత్రం రావడం, అలసిపోవడం వంటివి మధుమేహం లక్షణాలు అని అందరికీ తెలిసిందే. కానీ, ఆ ‘వెలుగు’కు ఎక్కువగా గురయ్యేవారు కూడా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని చైనాకు చెందిన పరిశోధకులు అంటున్నారు.
ప్రాంక్రియాస్ పనితీరు సరిగా లేనపుడు డయాబెటిస్ సమస్య శరీరంలో మొదలవుతుందనేది తెలిసిన విషయమే. డయాబెటిస్ మొదలైన తర్వాత రక్తంలో గ్లూకోజ్.. అవసరమైన దాని కంటే ఎక్కువ, లేదా తక్కువ ఉంటుంది. స్థిరంగా కొనసాగదు. వీధుల్లోని ఆర్టిఫిషియల్ లైట్ (Light At Night-LAN) కూడా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుందని చైనా పరిశోధకులు అంటున్నారు. దీని గురించిన వివరాలను డయాబెటాల్జియాలో ప్రచురించారు. దాదాపుగా 9 మిలియన్ కేసుల్లో లాన్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు కనిపించాయట. చైనాలోని నాన్ కమ్యూనల్ డిసీస్ సర్వేయలెన్స్ స్టడీస్ వారి నుంచి సెకరించిన డేటాను వైద్య నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారట. 98,658 మందిని అధ్యయనానికి ఎంచుకుని.. వారిలో LANతో పాటు బీఎంఐ వంటి ఇతర కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పరిశోధించారు.
హైయ్యర్ లాన్ ఏరియాల్లో ఉండే వారిలో డయాబెటిస్ 28 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. హైయ్యర్ లాన్ ఏరియాల్లో నివసించే వారిలో అత్యధికంగా.. ప్రతి 42 మందిలో ఒక డయాబెటిస్ రోగి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని బట్టి UK జనాభాలో దాదాపు 83 శాతం, USAలో 99 శాతం ప్రజలు ‘లైట్ పొల్యూటెడ్ స్కై’ కిందే నివసిస్తున్నారని, వీరంతా కూడా రిస్క్ లో ఉన్నట్టే అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టైప్-1 డయాబెటిస్ జెనెటికల్‌గా సక్రమిస్తుంది. టైప్-2 డయాబెటిస్ లైఫ్ స్టయిల్ డిసీజ్. ఈరెండింటిలో లాన్ ఎక్స్పోజర్ ఏరకమైన తేడా చూపుతుందనేది ఈ అధ్యయనం వివరించలేదని ‘యూనివర్సిటి ఆఫ్ కెస్టర్’కు చెందిన డాక్టర్ గారెత్ న్యే అంటున్నారు. ఆరోగ్య కరమైన నిద్ర డయాబెటిస్‌ను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం టైప్-2 డయాబెటిస్ రావడానికి గల కారణాల్లో ఒకటని ఆయన అంటున్నారు.
హైయ్యెస్ట్ ఆర్టిఫిషియల్ అవుట్ డోర్ లైట్ లెవెల్స్ అర్బన్ ఏరియాల్లో, పెద్ద సిటీల్లో ఎక్కువ. ఇప్పటికే అర్బన్ ఏరియాల్లో కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం, సెడంటరీ లైఫ్ స్టయిల్, సోషల్ యాక్టివిటి తక్కువగా ఉండడం, ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల ఒబెసిటి రిస్క్ ఎక్కువ. ఒబెసిటి టైప్ 2 డయాబెటిస్ కి కారణం అవుతుంది.
ఇదివరకు యూస్ లో జరిపిన అధ్యయనంలో చిన్న లైట్ వెలుతురులో నిద్ర పోయినా కూడా అది డయాబెటిస్ ను ప్రభావితం చేస్తుందని వివరించారు. చేతికి కట్టే పరికరం ద్వారా టెస్ట్ చేసినపుడు చిన్న లైట్ వెలుతురులో నిద్రపోయిన వారిలో కూడా 72 శాతం హైపర్ టెన్షన్ రిస్క్, 82 శాతం రిస్క్ ఆఫ్ ఒబెసిటి రిస్క్, 100 శాతం డయాబెటిస్ రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా వాళ్లు సంక్షిప్త పరిచిన దాన్ని బట్టి మెలటనోనిన్ తగ్గినపుడు డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. లైట్ వెలుతురు మెలటనోనిన్ లెవెల్స్ మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్ పోజర్ వల్ల ఇన్సులిన్ ప్రక్రియ మీద ప్రభావం చూపుతుందని , ఇది కొనసాగితే గ్లూకోజ్ ఇన్ టాలరెన్స్ వస్తుందని నెదర్లాండ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ నిపుణులు కూడా అంటున్నారు.