ఇంట్లో ఉన్నా, బయటకి వెళ్తున్నా తప్పనిసరిగా శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా ముఖ్యం. అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకి కూడా ఇది ముఖ్యమే. UV కిరణాల నుంచి శరీరాన్ని సంరక్షించుకునేందుకు తప్పనిసరిగా దీన్ని అప్లై చేసుకోవాలి. లేదంటే చర్మ సమస్యలకి దారి తీస్తుంది. సూర్యుడి నుంచి నేరుగా వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా ప్రమాదకరం. ఒక్కోసారి వీటి వల్ల చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎండలో ఉండే వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ ధరించకుండా ఉండకూడదు అని డెర్మటాలజిస్ట్ చెబుతారు.


వేసవి కాలంలో మాత్రమే కాదు చలికాలంలో కూడా దీని ధరించాలి. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు అది రాసుకోవడం వల్ల మరింత జిగటగా అనిపిస్తుంది కదా ఉపయోగించడం మానేస్తారు. కానీ అది కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. దాదాపు 80 శాతం సూర్య కిరణాలు మేఘావృతమైన రోజుల్లో కూడా భూమిని చొచ్చుకుపోతాయి. ఇవి చర్మానికి హాని కలిగించకుండా ఈ కీర్ణయాలని నిరోధరించడంలో SPF సహాయపడుతుంది.హానికరమైన సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇదే కాదు సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


చర్మం రంగును సమం చేస్తుంది


సన్ స్క్రీన్ రంగు పాలిపోవడాన్ని, సన డ్యామేజ్ నుంచి డార్క్ స్పాట్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది మృదువైన స్కిన్ టోన్ ని అందిస్తుంది.


టాన్ రిమూవర్


చర్మాన్ని శుద్ధి చేస్తుంది. సన్ స్క్రీన్ లు టానింగ్ ను 100 శాతం నిరోధించలేనప్పటికి ఎండలో ఎక్కువ సేపు ఉన్నప్పుడు చర్మానికి హాని కలగకుండా చేస్తుంది. చర్మానికి ఇదొక మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. సన్ స్క్రీన్ లోషన్ అనేది ఒక్క మొహానికి మాత్రమే ఉపయోగించడమే కాదు ఎండ తగిలే ప్రతి శరీర భాగానికి రాసుకోవాలి. అయితే ఒక్కో భాగానికి ఒక్కో రకమైన లోషన్ ఉంటుంది. మొహానికి రాసిన క్రీమ్ శరీరానికి రాసుకోకూడదు. ఇలా చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.


చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది


సన్ డ్యామేజ్ మూడు రకాల చర్మ క్యాన్సర్ లకి కారణం అవుతుంది. అందుకే ఇంట్లో లేదా ఆరుబయట ఉన్నా కూడా క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.


అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది


UV కిరణాల వల్ల చర్మం ఫోటోయేజింగ్ అవుతుంది. చర్మంపై గీతలు, ముడతలు ఏర్పడటానికి దోహదపడుతుంది. రోజూ సన్ స్క్రీన్ ధరించడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ కి గురి కాకుండా కాపాడుతుంది.


మొటిమలు ఉన్న వాళ్ళు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత వాళ్ళు సూచించిన దాన్ని ఉపయోగించాలి. లేదంటే చర్మం మీద మంట, చికాకు, ఎర్రగా అయిపోవడం జరుగుతుంది. బయట ఎండలో ఉన్నప్పుడు రెండు గంటలకి ఒకసారి రాసుకుంటే చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ లో ఉండే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్(ఎస్ పీ ఎఫ్) 30 శాతం అయినా ఉండే విధంగా చూసుకోవాలి. అవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: అల్యూమినియం ఫాయిల్స్‌లో ఆహారం నిల్వ చేస్తున్నారా? అది ఎంత డేంజర్ తెలుసా?