క్కోడు ఏమైపోయినా పర్వాలేదు, ముందుగా మన పని అయిపోవాలి. ట్రాఫిక్ రూల్సా? ‘అరే, పోలీస్ మామ లేడురా.. సిగ్నల్ జంప్ అయిపోదాం’ అనుకొనే టైపు మనలో చాలామందే ఉంటారు. కేవలం కొద్ది మందికి మాత్రమే ట్రాఫిక్స్ సెన్స్ ఉంటుంది. మిగతవాళ్లు మాత్రం రాంగ్ రూట్‌లో వస్తారు.. ముగ్గురేసి, ఐదుగురేసి మందితో బైకులపై తిరుగుతారు. కొంపలు అంటుకుపోయినట్లు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్లో మాట్లాడేస్తుంటారు. ఇక సామాజిక బాధ్యత విషయానికి వస్తే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరైనా ప్రమాదంలో ఉంటే, ముందుగా వీడియో తీస్తారు. అది బాగా వచ్చిన తర్వాతే సాయం గురించి ఆలోచించే టైపు కూడా చాలామందే ఉన్నారు. మంచోళ్లు కనిపిస్తే చాలు మోసాలతో నిలువునా ముంచేస్తారు. కానీ, ఈ రాష్ట్రం గురించి తెలిస్తే.. ‘‘ఛీ, ఇలాంటి మనషుల మధ్య మనం జీవిస్తున్నాం’’ అని అనుకుంటారు. ఆ రాష్ట్రం మరెక్కడో కాదు.. మన ఇండియాలోనే ఉంది. అదే మిజోరం. 


వీరి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి: పచ్చని కొండలు, వెదురుతో నిండిన అరణ్యాలకు ప్రసిద్ధి చెందిన మిజోరం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈశాన్య భారతంలో ‘ల్యాండ్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్’గా పేరొందిన మిజోరంను ప్రకృతికి పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. అక్కడి ప్రకృతి తరహాలనే ప్రజల జీవితం కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు.. తమ సమస్యలను ప్రభుత్వమే పరిష్కరిస్తుందిలే అని నిర్లక్ష్యంగా వదిలేసే టైపు కాదు. తమ సమస్యలను తామే తీర్చుకోవాలని, పక్క వాళ్ల సమస్యలను కూడా పరిష్కరిచాలని పరితపించే బాధ్యత గల పౌరులు. ట్రాఫిక్ నిబంధనల నుంచి అక్షరాస్యత వరకు.. ఇలా మిజోరం ప్రజల నుంచి మనం నేర్చుకోవలసింది చాలానే ఉన్నాయి. 


ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు: 


ఇటీవల సోషల్ మీడియాలో మిజోరంలో ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను ఎంత కచ్చితంగా పాటిస్తారో చూడండి అంటూ పోస్ట్ చేసిన ఓ చిత్రం వైరల్‌గా మారింది. అందులో డివైడర్ లేని రోడ్డులో ఒక వైపు వాహనాలతో నిండిపోయింది. ఒక్కరు కూడా గీత దాటి రెండో వైపుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అలాంటి రోడ్లో మనోళ్లు ఏం చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. ఏ వాహనాలు రావడం లేదని ఆ గీత దాటి అందరి కంటే ముందు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఓపిక అనేది అస్సలు ఉండదు. కానీ, మిజోరం ప్రజలు తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తారు.


అక్షరాస్యతలోనూ టాప్: మీజోరం ప్రజలు క్రమశిక్షణతో జీవించడమే కాదు. వారికి చదువు విలువ కూడా బాగా తెలుసు. 2011 జనాభా లెక్కల్లో మిజోరం 91.3 శాతం అక్షరాస్యతతో మూడో స్థానంలో నిలిచింది. కేరళలో అక్షరాస్యత 94.0 శాతం ఉండగా, లక్షద్వీప్‌లో 91.8 శాతం ఉంది. మిజోరంలో గల ‘సెర్చిప్’ ఇండియాలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడి అక్షరాస్యత శాతం 97.91 శాతం ఉంది.


ప్రతి ఇంటి నుంచి ఒకరు సామాజిక సేవకు..:


మిజోరంలో ప్రభుత్వం కంటే సామాజిక సంస్థలే ఎక్కువ చురుగ్గా ఉంటాయి. వాటిలో ‘ది యంగ్ మిజో అసోసియేషన్’(YMA) ఒకటి. మిజోరంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పకుండా ఈ సామాజిక సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ఈ అసోసియేషన్‌ను 1935లో క్రిస్టియన్ మిషనరీలు స్థాపించారు. 14 సంవత్సరాల దాటిన ఎవరైనా సరే ఈ సంస్థలో సభ్యత్వం తీసుకోవచ్చు. మిజోరంలోని ప్రతి ప్రాంతంలో ఒక YMA శాఖ ఉంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ అసోసియేషన్ సేవలు అందిస్తోంది. ఇందులో సభ్యత్వానికి రూ.5 చెల్లిస్తే చాలు. ఆ తర్వాత అసోసియేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలోను పాల్గోవచ్చు. ఈ అసోసియేషన్ చేపట్టే పనులు ఇవే.
⦿ అనాథలకు అంత్యక్రియలను నిర్వహించడం లేదా సాయం చేయడం.
⦿ ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు. 
⦿ చదువు కోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించడం.
⦿ సామాజిక సేవలపై ఆసక్తి కలిగించడం. 
⦿ వితంతువులు మరియు నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించడం
⦿ నదుల్లో మునిగిపోయిన వ్యక్తుల మృతదేహాల కోసం గాలించడం. 
⦿ అడవిలో ఏర్పడే కార్చిచ్చును అరికట్టడం. దానిపై అవగాహన కల్పించడం.
⦿ మానసిక, శారీరక వికలాంగులకు సేవలు. 
⦿ ప్రభుత్వ ప్రాజెక్టుల పరిశీలన. 
⦿ ఇతరులకు సాయం చేసేవారిని ప్రోత్సాహించడం, గౌరవించడం.
⦿ ప్రభుత్వ నిబంధనలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం.


Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!


లా మిజోరాంలో శాంతియుత జీవితం కోసం అక్కడి ప్రజలు పాటించే నియమ నిబంధనలు, సామాజిక సేవలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీరు చేస్తున్న పనుల్లో ఒక్కటైనా మనం అమలు చేస్తున్నామా? మనలో కూడా సామాజిక సేవలు చేయడానికి ఆసక్తి చూపే వ్యక్తులు ఉంటారు. అలాంటివారికి మనం అండగా ఉంటే.. ప్రభుత్వంతో పనిలేకుండా మిజోరం కంటే గొప్ప రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రాలను నిర్మించుకోవచ్చు. (Images credit: Twitter and Pixabay)


Also Read: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?