ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. అటుగా వెళ్లే ఓడల నుంచి విమానాల వరకు ఏదీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మనుషులు చంద్ర మండాలన్ని అందుకున్నారే గానీ, భూమి మీద ఉన్న ఈ భయానక ప్రాంతం వెనుక ఉన్న మిస్టరీని మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేదు. చాలామంది చాలా కారణాలు చెబుతున్నా.. ఇప్పటివరకు ఆధారాలు కూడా లేవు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద వాతావరణం అసాధారణంగా ఉంటుందని, అందుకే అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రావడం లేదని కొందరు, అక్కడ ఏలియన్స్ నివసిస్తున్నాయని మరికొందరి వాదన. ఇంకొందరైతే అక్కడ పెద్ద సుడిగుండం ఉంటుందని.. అది ఓడలు, విమానాలను మింగేస్తోందని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నది చెప్పేందుకు ఒక్క సాక్షి కూడా లేరు. అలాంటి ప్రాంతానికి విలాసవంతమైన లగ్జరీ నౌకలో విహార యాత్రకు వెళ్లడమంటే.. ప్రాణాలతో చెలగాటమే. దాన్ని విహార యాత్ర అనడం కంటే సాహస యాత్ర అనడమే బెటర్.
బహమాస్‌కు చెందిన నార్వేజియన్ ప్రైమా లైనర్ అనే క్రూయిజ్ నౌక ఇటీవల బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘‘రెండు రోజుల ప్రయాణానికి జస్ట్ రూ.1.4 లక్షలు చెల్లిస్తే చాలు.. మిమ్మల్ని బెర్ముడా ట్రయాంగిల్‌కు తీసుకుని వెళ్తాం. ఒక వేళ అక్కడి నుంచి తిరిగి రాకపోతే మీరు చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చేస్తాం’’ అని ఆ సంస్థ ప్రకటించింది. ఆఫరైతే టెమ్టింగ్‌గానే ఉంది కానీ, ఒక వేళ ఆ ఓడతో సహా సముద్రంలో అదృశ్యమైతే.. ఆ డబ్బును వాపస్ తీసుకోడానికి మనం ప్రాణాలతో ఉండాలి కదా అని పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి లాజిక్ కూడా నిజమే కదా.
Also Read: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది?
అమెరికాకు ఆగ్నేయంలో అట్లాంటిక్ మహా సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. బెర్ముడా, ఫ్లొరిడా, ప్యూర్టోరికో ప్రాంతాలను కలుపుతూ త్రిభుజాకారంలో ఈ ప్రాంతం ఉంటుంది. దీన్నే అంతా ‘డెవిల్స్ ట్రయాంగిల్’ అని కూడా అంటారు. అక్కడి వెళ్లిన నౌకలు, విమానాలు వెనక్కి రాకపోవడంతో ఆ ప్రాంతం అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. అందుకే, అక్కడికి ప్రయాణమంటే.. అంతా కొత్తగా స్పందిస్తున్నారు. 2017లో ఓ ఆస్ట్రేలియా శాస్త్రవేత్త బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించారు. అవన్నీ మానవ తప్పిదాల వల్ల చోటుచేసుకున్న ప్రమాదాలేనని, అక్కడ ఛేదించడానికి ఎటువంటి రహస్యం లేదంటూ.. సింపుల్‌గా కొట్టిపడేశారు. మరి, మీరు ఆ నౌకా విహారానికి సిద్ధమేనా?
Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!