TSRTC Water Bottle :  తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తుంది. త్వరలో టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ రానున్నాయి. వాటర్ బాటిల్ డిజైన్‌, పేరును సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కోరారు. వాటర్  బాటిల్ పేరు, డిజైన సూచించి ప్రైజ్ మనీ గెలుచుకోండని టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటన చేసింది. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా తెలిపారు. వాటర్ బాటిళ్లకు పేరు, డిజైన్ సూచించాలన్నారు. బెస్ట్ డిజైన్ పంపిన వారికి ప్రైజ్ ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీలో తీసుకొస్తున్న సంస్కరణలకు ప్రయాణికులు తోడ్పాటునివ్వాలన్నారు. ప్రయాణికుల కోసం 500 ఎం.ఎల్, లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సూచనలను ఆర్టీసీ వాట్సాప్ నంబర్ 9440970000కు పంపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. 






నైట్ రైడర్స్ సర్వీసులు


ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి, పనుల నిమ్మితం రాత్రి సమయాల్లో నగరానికి చేరుకునే వారు గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని నిర్ణయించింది. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్లవారుజామున 5 గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లో రాత్రి వేళలో ప్రజా రవాణా విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి ప్రయాణించాలంటే సొంత వాహనాలు ఉంటే తప్ప ప్రయాణం సాగని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పేందుకు నిర్ణయం తీసుకుంది. నైట్ రైడర్స్ పేరుతో ఆర్టీసీ బస్సుల్ని అర్థరాత్రి దాటిన తర్వాత నడిపే ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు వేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అర్థరాత్రి 12.15 గంటలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు పటాన్ చెరు వరకు వెళుతుంది. ఈ రూట్ లు పలు ప్రత్యేక సర్వీసులు తిప్పుతారు. ఈ సర్వీసులకు వచ్చే ఆదరణను చూసి తర్వాత మిగిలిన రద్దీ రూట్లలో అర్థరాత్రి వేళ బస్సుల్ని తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది. సికింద్రాబాద్-పటాన్ చెరు, పటాన్ చెరు- సికింద్రాబాద్, సికింద్రాబాద్-చార్మినార్, చార్మినార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సీబీఎస్, సీబీఎస్-సికింద్రాబాద్ మధ్య సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.