Link Between Stress and Stroke : ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఒత్తిడి అనేది కామన్​గా మారిపోయింది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఆఫీసు టార్గెట్లు, డెడ్‌లైన్స్, వ్యక్తిగత జీవితంలోని టెన్షన్లు ఒత్తిడికి కారణమవుతున్నాయట. దీనివల్ల మానసికంగా బలహీనపడడం నుంచి.. స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యకు కారణమవుతుందని చెప్తున్నారు నిపుణులు. అయితే ఒత్తిడిని కంట్రోల్ చేయకపోతే.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందట. మరి ఒత్తిడి ఎలా ప్రాణాంతకం అవుతుంది? దానివల్ల స్ట్రోక్ ప్రమాదం ఎలా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

ఒత్తిడి వల్ల స్ట్రోక్ ప్రమాదం

యువతలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా కూర్చోనేవారికి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ. ఈ  ప్రమాదం యువతలో వేగంగా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇవి రెండూ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు. దీనితో పాటు ఒత్తిడి వల్ల ఊబకాయం కూడా పెరుగుతుంది. ఇది మెదడు సంబంధిత స్ట్రోక్‌ను పెంచుతుంది.

స్ట్రోక్ లక్షణాలు

మెదడు సంబంధిత స్ట్రోక్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. ముఖం లేదా చేతులు, కాళ్లల్లో తిమ్మిరి లేదా బలహీనత ఉంటుంది. మాట్లాడటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. కారణం లేకుండా తలనొప్పి, బ్యాలెన్స్ కోల్పోవడం, మైకం లేదా అస్పష్టంగా కనిపించడం వంటివి స్ట్రోక్ ప్రారంభ లక్షణాలుగా చెప్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం స్ట్రోక్ విషయంలో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనదట. స్ట్రోక్ లక్షణాలతో ఇబ్బంది పడే వ్యక్తికి మొదటి గంటలో చికిత్స అందిస్తే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చట. దీనివల్ల త్వరగా కోలుకుంటారు.

Continues below advertisement

స్ట్రోక్ రాకూడదంటే ఇవి చేయాల్సిందే

ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని కంట్రోల్​లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటివాటిలో బీపీ ఒకటి. అధిక రక్తపోటు స్ట్రోక్‌కు ప్రధాన కారణం కాబట్టి దానిని కంట్రోల్​లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడి వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఇబ్బంది కలిగిస్తాయి.  దీనివల్ల రక్తం గడ్డకట్టవచ్చు. కాబట్టి షుగర్​ని కంట్రోల్​లో ఉంచుకోవాలి. డైట్​లో పండ్లు, కూరగాయలు, ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్స్, లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. 

వీటితోపాటు ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం చేయాలి. లేదా వాకింగ్ చేయవచ్చు. యోగా చేయడం వల్ల మరిన్ని మంచి బెనిఫిట్స్ ఉండవచ్చు. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రతను తగ్గుతుంది. లేదంటే ప్రాణాంతకమే. అందుకే స్ట్రోక్ రిలేటెడ్ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి అంటారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.