Watermelon Consumption During Summer : సమ్మర్​లో ఎక్కువమంది తినే ఫ్రూట్స్​లో పుచ్చకాయ ఒకటి. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. నేరుగా, జ్యూస్​ల రూపంలో దీనిని డైట్​లో చేర్చుకుంటారు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. హైడ్రేషన్​ని అందిస్తుంది. సమ్మర్​లో దీనిని బెస్ట్​ ఫుడ్​గా తీసుకుంటారు. ఆరోగ్యానికి కూడా దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. కేవలం పుచ్చకాయే కాదు.. పుచ్చకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు అందిస్తాయి. 

ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే ఈ పుచ్చకాయను కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. వేసవిలో దీనిని ఎక్కువగా తినే అలవాటు ఉంటే కచ్చితంగా దానిని కంట్రోల్ చేయడమో.. లేదా పూర్తిగా నివారించడమో చేయాలంటున్నారు. అసలు ఏ ఆరోగ్య సమస్యలు ఉంటే దీనిని తినకూడదో.. దీనిని తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

జీర్ణ సమస్యలు 

జీర్ణ సమస్యలున్నవారు పుచ్చకాయను తినకపోవడమే మంచిదట. పుచ్చకాయలో అధిక నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా.. కొందరిలో కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది. అందుకే వాటిని లిమిట్​గా తీసుకోవడమో.. పూర్తిగా కంట్రోల్ చేయడమో చేయాలని అంటున్నారు. 

షుగర్ ఉన్నవారు.. 

మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. పుచ్చకాయలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. దానిలోని సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నెగిటివ్​గా ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవచ్చని చెప్తారు. 

కిడ్నీ సమస్యలు ఉంటే.. 

పుచ్చకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. 

లైకోపీన్

పుచ్చకాయను అధికంగా తీసుకుంటే లైకోపీన్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల చర్మం నారింజ రంగులోకి మారుతుంది.

ఇవే కాకుండా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడేవారు దీనిని తినకపోవడమే మంచిది. జ్వరం, అలెర్జీలతో ఇబ్బంది పడేవారు కూడా పుచ్చకాయను కంట్రోల్ చేయడమే మంచిదని చెప్తున్నారు. 

ఎంత తింటే మంచిది..

ఈ సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను లిమిట్​గా తీసుకున్నా.. ఆరోగ్యంగా ఉండేవారు కూడా దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదని చెప్తున్నారు. రోజుకు 100-150 గ్రాములు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కూడా అందుతాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : సమ్మర్​లో పుచ్చకాయను ఇలా తీసుకుంటే.. హెల్త్​కి, బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.