Lazarus Syndrome:  కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడని, మరణించని వ్యక్తి మళ్లీ బతికాడని కథనాలు చదువుతూ ఉంటాం. దీనికి కారణం లాజరస్ సిండ్రోమ్. ఈ ఆరోగ్యపరిస్థితి వస్తే గుండె కొన్ని క్షణాల పాటూ కొట్టుకోవడం ఆగిపోతుంది. తిరిగి యథావిధిగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. కొందరిలో గుండె కొట్టుకోవడం ఆగిపోయి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేసినా కూడా గుండె సాధారణ స్థితికి రాదు. కాసేపటి తరువాత రక్తప్రసరణ తిరిగి గుండెకు మొదలవుతుంది. దీన్నే చచ్చి బతకడం అంటారు. ఈ 
 లాజరస్ సిండ్రోమ్‌ ఒక అరుదైన దృగ్విషయం. .


లాజరస్ పేరెలా...
లాజరస్ అనే పేరు పౌరాణిక పాత్ర నుండి వచ్చింది. లాజరస్ అనేది బైబిల్‌లోని ఒక పాత్ర. అతను 4 రోజుల క్రితం చనిపోయినట్లు గుర్తిస్తారు. తరువాత తిరిగి యేసు ఆయనను బతికిస్తారు. ఇలా చనిపోయి మళ్లీ బతికిన వ్యక్తిగా లాజరస్ చరిత్రలో గుర్తుండిపోయారు. ఈ వ్యాధిలో కూడా కొన్ని క్షణాల పాటూ గుండె మరణించి, తిరిగి మళ్లీ జీవిస్తుంది కాబట్టి... ఈ సిండ్రోమ్‌కు లాజరస్ వ్యాధి అని పేరు పెట్టారు. 


ఇది ఎందుకు వస్తుంది?
లాజరస్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా వైద్యులకు తెలియరాలేదు. ఇతర కారకాల కలయిక కారణంగా ఈ ఆరోగ్య పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ కారకాలు గుండెను ఆగిపోయేలా చేస్తాయి. CPR చేసినా పల్స్ కనిపించదు. ఈ వ్యాధి చాలా డేంజరస్. ఇదొక్కసారి వచ్చిందంటే శరీరంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.  కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది. రోగులు మెదడు దెబ్బతినడం, మూర్ఛ రావడం,అభిజ్ఞా లోపాలు, నరాల సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మరణాన్ని చూసి వచ్చే ఈ రోగులు మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. భావోద్వేగ సమస్యలను కూడా అభివృద్ధి చేయవచ్చు. దీని బారిన ఎవరు పడతారో అంచనా వేయడం చాలా కష్టం. ఏ వయస్సులోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లాజరస్ సిండ్రోమ్ నుండి బయటపడిన వ్యక్తుల దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతారు. 


లాజరస్ సిండ్రోమ్ రావడానికి ఛాతీపై ఒత్తిడి పెరిగిపోవడం కూడా ఒక కారణమే. అమెరికాకు చెందిన వెల్మా థామస్ అనే మహిళ కార్డియాక్ అరెస్టు వచ్చింది. ఆసుపత్రిలో చేరాక కూడా రెండు సార్లు గుండె పోటు వచ్చింది. ఆమె లైఫ్ సపోర్టు అందించారు. తరువాత ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో ఆమె మరణించినట్టు ప్రకటించారు వైద్యులు. దాదాపు 17 గంటలు ఆమె అలాగే ఉంది. అంత్యక్రియలకు ఏర్పాటు చేశాక హఠాత్తుగా కళ్లు తెరిచింది. ఆ తరువాత కోలుకుంది కూడా. లాజరస్ సిండ్రోమ్ లో ఇలాంటి వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. 



Also read: కలబందతో అందమే కాదు అలెర్జీలు కూడా వచ్చే అవకాశం


Also read: ఇక్కడున్న అంకెల్లో తేడాగా ఉన్న అంకె ఎక్కడుందో కనిపెట్టండి, అది కూడా పది సెకన్లలో...














































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.