Kiss Day | స్నేహం హద్దులు దాటి ముద్దుల వరకు వచ్చిందంటే.. అది ‘ప్రేమే’. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నడుస్తోంది ప్రేమికుల సీజన్. కాబట్టి.. ఇప్పటికీ ఫ్రెండ్ ఎవరో, లవర్ ఎవరో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే.. గత కొద్ది రోజులుగా ‘రోజ్ డే’ మొదలుకుని.. ‘హగ్ డే’ వరకు ఏదో ఒక ‘రోజు’ను మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వాడేసే ఉంటారు. ఒక వేళ.. మీకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ‘Kiss Day’ను అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే.. ముద్దు కేవలం ప్రేమ, కోరికలను వ్యక్తం చేసేదే కాదు.. ఆరోగ్యాన్ని అందించే దివ్యౌషదం కూడా. ఆలస్యం చేయకుండా.. ఆ ప్రయోజనాలేమిటో చూసేద్దామా!


❤ సెక్స్‌వల్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. హార్మోన్లను ప్రేరేపించి రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. ఆ తర్వాత తెలియని మైకంలోకి తీసుకెళ్లి హద్దులు దాటేలా చేస్తుంది.
❤ తలనొప్పి వేదిస్తున్నప్పుడు మీ పార్టనర్‌ను కిస్ చేయండి. తగ్గిపోతుంది. 
❤ ముద్దుపెట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
❤ ముద్దు మీ హృదయ స్పందనను నియంత్రించగలదు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 
❤ ముద్దు రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
❤ ముద్దు ఒత్తిడి, కుంగుబాటు నుంచి దూరం చేస్తుంది. 
❤ శరీరానికయ్యే గాయాల నొప్పిని తగ్గించే శక్తి కూడా ముద్దుకు ఉంటుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు కలిగే రక్తనాళాల విస్తరణ వల్ల ఇలా నొప్పి మాయవుతుంది.
❤ కిస్ చేసేప్పుడు ఏర్పడే శరీరంలో అడ్రినాలిన్ అనే రసాయం వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది.
❤ ముద్దు పెట్టుకోవడం వల్ల మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
❤ ముద్దు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
❤ ముద్దు వల్ల ఏర్పడే లాలాజల స్రావం దంతాల్లో కావిటీస్‌(దంత క్షయం)తో పోరాడేందుకు సహాయ పడుతుంది.
❤ ముద్దు మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. 
❤ పెదాలపై కిస్ చేస్తే మెడ, దవడ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది.
❤ ముద్దు పెట్టుకున్నప్పుడు ఏర్పడే సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి మంచి రసాయనాల వల్ల మీరు ఉల్లాసంగా ఉంటారు. ఇవి శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.
❤ కిస్ చేయడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది.
❤ ముద్దు కూడా యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 
❤ కిస్ చేసేప్పుడు పెదవులు అధిక రక్త ప్రసరణతో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అది ముఖ కండరాలను టోన్ చేస్తుంది. 
❤ కిస్ వల్ల ముఖంలోని 34 కండరాలు, 112 పోస్ట్రల్ కండరాలు ఉత్తేజితం అవుతాయి.
బరువు తగ్గాలంటే?: చివరిగా.. బరువు తగ్గాలి అని అనుకుంటే.. మీరు తప్పకుండా మీ పార్టనర్‌ను ముద్దులతో ముంచెత్తాలి. ముఖ్యంగా అదరాలను జుర్రుకోవాలి. ఎందుకంటే మీరు ముద్దు పెట్టుకునేప్పుడు కొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. ఒక నిమిషంపాటు పెట్టుకొనే సాధారణ కిస్‌కు 2 నుంచి 3 క్యాలరీలు ఖర్చవుతాయి. ఉద్వేగమైన ముద్దుకు 5 నుంచి 26 క్యాలరీలు ప్రతి నిమిషానికి ఖర్చు కావచ్చు. మరి, మీరు Kiss Day రోజు ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయాలని అనుకుంటున్నారు?


గమనిక: వివిధ అధ్యయనాలు, కథనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించామని గమనించగలరు. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు.