Radhika Merchant-Anant Ambani Wedding: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ ముద్దుల కూతురు రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలో ప్రపంచ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. పలువురు దేశాధినేతలు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల అధినేతలు, ప్రముఖ సినీతారలు హాజరుకాబోతున్నారు.


అనంత్-రాధిక పెళ్లికి హాజరయ్యే అతిథులు వీళ్లే


రాధిక, అనంత్‌ వివాహ వేడుకకు రియాల్టీ షో స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ అతిథులుగా హాజరుకానున్నారు. ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండిస్, ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్, సెల్ఫ్-హెల్ప్ కోచ్ జే శెట్టి సైతం ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. బ్రిటన్ మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, స్వీడిష్ మాజీ పీఎం కార్ల్ బిల్ట్, కెనడా మాజీ పీఎం స్టీఫెన్ హార్పర్ కూడా ఈ పెళ్లికి రానున్నారు.


అటు టాంజానియా ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్, IOC వైస్ ప్రెసిడెంట్ జువాన్ ఆంటోనియో సమరాంచ్, WTO DG న్గోజి ఒకోంజో ఇవేలా, FIFA అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో కూడా అంబానీ పెళ్లికి హాజరుకానున్నారు. హెచ్‌ఎస్‌బిసి గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అరామ్‌ కో సిఈఓ అమిన్ నాసర్, మోర్గాన్ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ముబాదాలా ఎండి ఖల్దూన్ అల్ ముబారక్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ, లాక్‌హీడ్ మార్టిన్ సీఈఓ జేమ్స్ టైక్లెట్, బిపి సీఈఓ ముర్రే ఔచ్‌, ఎరిక్సన్ సీఈఓ బోర్జే ఎఖోల్మ్  ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు.  


అటు HP ప్రెసిడెంట్ ఎన్రిక్ లోరెస్, ADIA బోర్డు మెంబర్ ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలాతీ, కువైట్ ఇన్వెస్ట్‌ మెంట్ అథారిటీ MD బాదర్ మొహమ్మద్ అల్ సాద్, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉయిట్టో, గ్లాక్సో స్మిత్‌క్లైన్ సీఈఓ ఎమ్మా వాల్మ్‌ స్లీ, GIC సీఈఓ లిమ్ చౌ కియాట్తో పాలు పలువురు భారత కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి వెళ్లనున్నారు.


హిందూ సంప్రదాయంలో పెళ్లి


అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. జులై 12న ప్రారంభం కానున్న పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 12వ తేదీన పెళ్లి వేడక జరగనుండగా, 13న శుభ్ ఆశీర్వాద్ వేడుకలు జరుగుతాయి. చివరి రోజున అంటే జులై 14వ తేదీన మంగళ ఉత్సవం జరగనుంది. అదే రోజు పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే జియో వరల్డ్ సెంటర్ పెళ్లి వేడుకలకు ముస్తాబైంది.



Read Also: అట్టహాసంగా అనంత్ అంబానీ హల్దీ వేడుక, పూల దుప్పట్టాతో రాధికా మర్చంట్ కనువిందు