Anant- Radhika Haldi: అట్టహాసంగా అంబానీ హల్దీ వేడుక, పూల దుప్పట్టాతో రాధికా మర్చంట్ కనువిందు

Radhika Merchant Haldi: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. హల్దీ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో రాధిక ధరించి పూల దుప్పట్టా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Continues below advertisement

Radhika Merchant Looks Ethereal In A Floral Jaal Dupatta: అపర కుబేరుడు, భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబాజీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్వరలో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా తాజాగా హల్దీ వేడుక నిర్వహించారు.  సోమవారం నాడు జరిగిన ఈ వేడుకలో వధూవరుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు  పలువురు పలువు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  

Continues below advertisement

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూల దుప్పట్టా

హల్దీ వేడుకలో వధువు రాధికా మర్చంట్ ధరించిన దుస్తులు చూపరులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఎల్లో కలర్ లెహంగా మీద పూల దుప్పట్టా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ దుప్పట్టాలో కొత్త పెళ్లి కూతురు మెరిసిపోతూ కనిపించింది. రియా కపూర్, అనామికా ఖన్నా ఈ దుస్తులను స్పెషల్ గా డిజైన్ చేశారు. మల్లెపూల బంతులు కలిపి కుట్టిన ఈ దుప్పట్టా చూపరులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం  హల్దీ వేడుకలో రాధిక ధరించిన ఎల్లో దుప్పట్టా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త పెళ్లి కూతురు ఎంత కళగా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అటు హల్దీ వేడుకల తర్వాత రాధిక ధరించిన పింక్ కలర్ లెహంగా కూడా అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు అనంత్, రాధిక కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. వీరిద్దరు వేసుకున్న డ్రెస్సులు అందరినీ అలరించాయి. రాధిక నుదిటిపై అనంత్ ముద్దు పెడుతూ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంబానీ ఇంట రోజుకో ప్రత్యేక వేడుక

ఇక అనంత్ పెళ్లిలో భాగంగా అంబానీ ఇంట్లో రోజుకో వేడుక జరుగుతోంది. సుమారు నెల రోజుల కిందటి నుంచే ఈ వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకలకు ప్రపంచ ప్రముఖులు హాజరవుతున్నారు. మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ లాంటి దిగ్గజ కంపెనీల సీఈవోలతో పాటు పలువురు టెక్‌ దిగ్గజాలు, క్రికెటర్లు, సినీ ప్రముఖులు ఈ సంబురాల్లో సందడి చేస్తున్నారు. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో అనన్యా పాండే, ఖుషీ కపూర్ సహా పలువురు సినీ నటీమణులు పాల్గొని కనువిందు చేశారు.   

ఈనెల 12న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న అనంత్, రాధికా

ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ఈ నెల 12న జరగనుంది. ముంబై బాంద్రాలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే వివాహ ఆహ్వానాలు అందించారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. పెళ్లి వేడుకలో పాల్గొనే అతిథుల కోసం ఏకంగా 2500 రకాల వంటకాల రుచి చూపించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: రాజ్‌తరుణ్‌ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్‌ చేయించాడని ఆరోపణ

Continues below advertisement
Sponsored Links by Taboola