Puri Jagannath Rath Yatra 2024: ఏటా ఆషాఢమాసం రెండో రోజు...విదియ రోజు పూరీ జగన్నాథుడి రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. పది రోజుల పాటూ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. తొమ్మిదిరోజుల పాటూ గుండిచా ఆలయం వద్ద ప్రత్యేక పూజలందుకునే జగన్నాథుడు..తిరిగి పదో రోజు బలభద్ర, సుభద్రతో కలసి బుహుదా యాత్రలో భాగంగా ఆలయానికి చేరుకుంటాడు. రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలమంది భక్తులు తరలివస్తారు. గర్భగుడి నుంచి కదలివచ్చే జగన్నాథుడి దర్శనం జన్మధన్యం అని భావిస్తారు. ఈ రథయాత్ర ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరగగా  ఇప్పుడు మరో అపశ్రుతి చోటుచేసుకుంది


Also Read: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!


ఒరిగిన బలభద్రుడి విగ్రహం


జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాలు గుండిచా మందిరానికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సూర్యాస్తమయం అనంతరం  చతుర్థామూర్తుల పొహండి జరిగింది. ఇందులో భగంగా విగ్రహాలను రథం నుంచి కిందకు దించారు. బలభద్రుడి విగ్రహం కిందకు దించుతుండగా పక్కకు ఒరిగిపోయింది..ఈ ఘటనలో గాయపడిన తొమ్మిదిమందిని చికిత్సకోసం హాస్పిటల్ కి తరలించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అపశ్రుతులు జరగలేదని సేవాయత్ లు, భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆషాడమాసం శనివారం ప్రారంభకావడంతో..ఆదివారం రథయాత్ర జరిగింది. సాయంత్ర ప్రారంభమైన రథయాత్రలో లక్షలమంది భక్తులు పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒకేసారి మూడు వేడుకలు నిర్వహించడంతో రథయాత్ర మొదలయ్యేసరికి ఆలస్యం అయింది. పొద్దుపోవడంతో ఆదివారం సాయంత్రం రథయాత్ర మొదలైనా..సోమవారం కూడా కొనసాగింది. అయితే ఆదివారం సాయంత్రం రథయాత్ర ప్రారంభసమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందనా 400 మంది గాయపడ్డారు. ఆ తర్వాత చీకటి పడడంతో రథయాత్ర నిలిపేసి..సోమవారం ఉదయం తిరిగి ప్రారంభించారు...గుండిచా ఆలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. సంప్రదాయం ప్రకారం జగన్నాథ,బలభద్ర, సుభద్ర రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్న తర్వాత రోజు పొహండి జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ  సమయంలోనూ బలభద్రుడి విగ్రహం పక్కకు ఒరిగి అపశ్రుతి జరిగింది. దీంతో కొద్దిసేపు ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి ఆ తర్వాత మూర్తులను ఆలయంలోకి చేర్చారు.  


Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!


జూలై 15 బహుదా యాత్ర


జూలై 07న రథయాత్ర మొదలైంది..తిరిగి జూలై 15న బహుదా యాత్ర జరగనుంది. అప్పటివరకూ గుండిచా ఆలయంలోనే పూజలందుకుని  బహుదాయాత్ర అనంతరం గర్భగుడికి చేరుకుంటాడు. పొహండి సమయంలో  జరిగిన ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పూరీ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వాస్తవానికి ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎలాంటి అపశ్రుతులు జరగవని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ చెప్పారు. శ్రీక్షేత్ర యంత్రాంగం సేవాయత్‌లకు పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా స్వామివారి సేవలతో ప్రమేయం ఉన్నవారు మాత్రమే రథాలపై ఉండారని పాలనాధికారి వీర్‌విక్రం యాదవ్‌ చెప్పారు కానీ రథయాత్రలో ఆ పరిస్థితి కనిపించలేదు. ఇంకా... జగన్నాథుని నందిఘోష్‌ రథంపై 70 మంది, బలభద్రుని వద్ద 60 మంది, దేవీ సుభద్ర సన్నిధిలో 50 మంది  సేవకులను మాత్రమే నియమించారు కానీ...ఆయా రథాలపై లెక్కలు మించి కనిపించారు. స్వామివారి దర్శనంకోసం తరలివచ్చిన లక్షలమంది భక్తులకు మూర్తులు కనిపించకుండా అడ్డంగా నిల్చున్నారు. తొక్కిసలాట జరిగేందుకు ఇది కూడా ఓ కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నయి. 


Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!