What is Friendship Marriage: రిలేషన్‌షిప్స్‌లో ఎప్పటికప్పుడు కొంత ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. లైఫ్‌స్టైల్‌తో పాటు అవీ అప్‌డేట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్‌లో కొత్తగా friendship marriage ట్రెండ్ మొదలైంది. South China Morning Post వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ వైవాహిక బంధం లాంటిదే అయినా ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. శృంగారంలోనూ పాల్గొనరు. కేవలం కలిసి ఉంటారు. జపాన్‌లో కనీసం 1% జనాభా ఈ రిలేషన్‌షిప్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుని, పరస్పరం గౌరవించుకుంటూ ఇలా ఒక్కటవుతున్నారు. వీళ్లలో స్వలింగ సంపర్కులూ ఉంటున్నారు. వివాహ బంధంపై పెద్దగా ఆసక్తి చూపించని వాళ్లంతా ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. నిజానికి ఇదేమీ కొత్త ట్రెండ్ కాదట. 2015 నుంచే చాలా మంది ఈ రిలేషన్‌లో ఉంటున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ప్రస్తుతానికి కనీసం 500 మంది ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, వాళ్లలో కొంత మంది ప్రత్యేకంగా ఇళ్లు కట్టుకుని అందులో నివసిస్తున్నారని తెలిపింది. 


ఇంతకీ ఏంటీ ట్రెండ్..? 


సాధారణంగా ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారంటే వాళ్ల మధ్య రొమాంటిక్‌ రిలేషన్ ఉండడం చాలా సహజం. కానీ.. Friendship Marriage లో మాత్రం అదేమీ ఉండదు. ఇద్దరూ "సన్నిహితంగా" ఉండకుండానే కలిసుంటారు. వీళ్లు కలిసి ఉండొచ్చు. లేదంటే విడిగానూ ఉండొచ్చు. అది పూర్తిగా వాళ్ల ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక పిల్లల గురించీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవచ్చు. శారీరకంగా కలిసి పిల్లల్ని కనడం కాకుండా కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందొచ్చు. ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ రిలేషన్‌లో ఉండే వాళ్లలో అబ్బాయైనా, అమ్మాయైనా వేరే వ్యక్తితో రొమాంటిక్‌ రిలేషన్‌లో ఉండొచ్చు. కాకపోతే ముందుగానే దీని గురించి మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకోవాలి. అనుమతి తీసుకుని వేరే వాళ్లతో రిలేషన్‌ని కంటిన్యూ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్లు కపుల్స్‌లా కాకుండా రూమ్‌మేట్స్‌లా ఉంటారు. మూడేళ్ల పాటు ఇలా రిలేషన్‌లో ఉంటారు. కేవలం ఓ వ్యక్తితో కలిసుండాలని, కుటుంబ బాధ్యతల బరువు ఎవరు మోస్తారులే అనుకునే వాళ్లు మాత్రమే ఈ రిలేషన్‌షిప్‌ని ఎంచుకుంటున్నారు. 


ముందుగానే మాట్లాడుకుని..


ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌కి ముందుగానే ఇద్దరూ కలిసి కూర్చుని ఒకరి గురించి ఒకరు పూర్తిగా మాట్లాడుకుంటారు. పరస్పరం తెలుసుకుంటారు. ఎలా కలిసుండాలి..? ఖర్చుల్లో ఎవరి వాటా ఎంత.. అనేది క్లియర్‌గా లెక్కలేసుకుంటారు. ఓ జంట కూర్చుని కేవలం రొమాంటిక్‌గానే మాట్లాడుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా కలిసి ఉండడానికి ఎలా ఉండాలో చర్చించుకోవచ్చని చెప్పడమే ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఉద్దేశం. వీళ్లలో కొంత మంది కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా పిల్లల్ని వాళ్లని పోషిస్తున్నారు కూడా. ఇక స్వలింగ సంపర్కులూ ఈ రిలేషన్‌ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఒంటరితనంగా ఫీల్ అయ్యే వాళ్లు, ఒత్తిడి ఎదుర్కొనే వాళ్లకి ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. 


Also Read: Mother's Day 2024: ‘మదర్స్ డే’కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ప్రయత్నించండి - అమ్మ ఆనందిస్తుంది