Mother's Day 2024 Gift Ideas: ఈ లోకంలో మనల్ని అమ్మ ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. ఇంటి కోసం, ఇంట్లో వాళ్ల కోసం నిత్యం ఆలోచిస్తూ, వాళ్లకు కావాల్సినవి అన్నీ సమకూరుస్తుంది అమ్మ. పిల్లలకు కూడా తల్లి మీద అంతే ప్రేమ ఉంటుంది. అలాంటి అమ్మకి మే 12 చాలా స్పెషల్ రోజు. అదే మదర్స్ డే. నిజానికి అమ్మని ప్రేమించే.. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మదర్స్ డే. కానీ, ఈ రోజు మాత్రం చాలా చాలా స్పెషల్. అయితే, అమ్మకి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి, అమ్మని ఎలా సర్ ప్రైజ్ చేయాలో అని చాలామంది తర్జన భర్జన పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఐడియాస్. స్పెషల్ డే రోజున అమ్మకి ఈ గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి.
మార్కెట్‌లో చాలా చాలా స్పెషల్, వెరైటీ, ఖరీదైన గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అమ్మకు ఏది ఇష్టమో? ఏం చేస్తే ఇష్టపడతారో ఆలోచించి గిఫ్ట్ ఇస్తే.. చాలా ఆనందిస్తుంది. కాబట్టి.. ఈ గిఫ్ట్‌లు ప్రయత్నించండి.
హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్..
గిఫ్ట్స్ లో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమతో మన చేతితో స్వయంగా చేసిన గిఫ్ట్ స్పెషల్ గా అనిపిస్తుంది. అవతలి వాళ్లను ఆనందపడేలా చేస్తుంది. అందుకు ఈ సారి మదర్స్ డే కి మీ చేతితో ఏదైనా ఒక గ్రీటింగ్ కార్డ్, కాలిగ్రఫి తయారు చేసి ఇవ్వండి. లేదా ఒక చక్కటి కవితను రాసి అమ్మకి బహుమతి ఇవ్వండి.
ఫ్లవర్స్..
పూలు అంటే ఎవరైనా ఇష్టపడతారు. అందుకే, ఈ సారి మదర్స్ డేకి మీ అమ్మకి ఇష్టమైన పూలను పంపించి సర్ ప్రైజ్ చేయొచ్చు. గిఫ్ట్ తో పాటు పూలు పంపొచ్చు. లేదా పూలను మాత్రమే గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను సంతోషపెట్టొచ్చు.
చీరలు, డ్రెస్సులు..
చీరలు, డ్రెస్సులు ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అందుకే, లేటెస్ట్ కలెక్షన్ లో చీర లేదా లేటెస్ట్ డ్రెస్ గిఫ్ట్ గా ఇవ్వండి.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్..
స్కిన్ కేర్ర ప్రొడక్ట్స్ ని కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. అవసరమైన సీరమ్స్, ఆయిల్ లాంటివి గిఫ్ట్ గా ఇవ్వండి. మేకప్ కిట్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్ లాంటివి కూడా గిఫ్ట్ చేయొచ్చు.
పర్సనలైజల్డ్ గిఫ్ట్స్..
అమ్మ కోసం స్పెషల్ గా తయారు చేయించిన గిఫ్ట్స్ కూడా ఇవ్వొచ్చు. పర్సనలైజ్డ్ స్వెట్ షర్ట్స్, పెండెంట్స్ ఇవ్వొచ్చు. ఏదైనా స్పెషల్ మెసేజ్ ప్రింట్ చేసి, లేదంటే ఒక చక్కటి కొటేషన్ తో స్పెషల్ గా తయారు చేయించి ఇవ్వొచ్చు.
స్పెషల్ ఫుడ్..
అమ్మ ప్రతి రోజు మన కోసం కిచెన్ లో వండుతూ కనిపిస్తుంది. రకరకాలు చేసి పెడుతుంది. అలాంటిది మదర్స్ డే రోజు ఆమెకు రెస్ట్ ఇచ్చి వండి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బ్రేక్ ఫాస్ట్, న్యూట్రిషియస్ డ్రింక్స్, సలాడ్స్ ఇంకా కొత్త కొత్త రకాలు మీ చేతులతో స్వయంగా వండిపెడితే ఆనందపడుతుంది.
Also Read: మీకు తెలుసా? కాఫీ, శబ్దాలు.. మిమ్మల్ని గజినీలా మార్చేస్తాయట - నమ్మబుద్ధి కావడం లేదా? కారణాలివే!