హ్యూమన్ వాషింగ్ మిషన్. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ సరే.. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ ఏంటని అనుకుంటున్నారా? ఈ వాషింగ్ మిషన్ మనుషులకు స్నానం చేయిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికీ వాస్తవం. నిజానికి హ్యూమన్ వాషింగ్ మెషీన్ ఉండాలనే ఆలోచన కొత్తదేమీ కాదు. 1970 ఒసాకా ఎక్స్‌పోలో, జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ తన 'అల్ట్రాసోనిక్ బాత్'ను ప్రదర్శించింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్మోడ్ లో పని చేస్తుంది. 15 నిమిషాల పాటు మనిషికి స్నానం చేయిస్తుంది. ఈ సమయంలో మిషన్ లోని హ్యూమన్ ను శుభ్రపరిచి, మసాజ్ చేసి, డ్రై చేస్తుంది. సంచలనం కలిగించే ఈ కాన్సెప్ట్ అలాగే మిగిలిపోయింది. వాణిజ్య ఉత్పత్తిగా మారలేదు. కానీ, ఇప్పుడు మరో జపనీస్ టెక్నాలజీ కంపెనీ దీన్ని నిజం చేయాలి అనుకుంటుంది. 2025 నాటికి హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ కల నిజం చేస్తామని చెప్తుంది.


స్నానం చేయించడం మాత్రమే కాదు, మరెన్నో..


ఒసాకాకు చెందిన సైన్స్ కో. లిమిటెడ్, బాత్, కిచెన్ టెక్నాలజీలో అనేక ఆవిష్కరణలకు రూపకల్పన చేసింది.  దాని మిరబుల్ ప్రొడక్ట్ శ్రేణిలో భాగంగా హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను రూపొందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను తాజాగా ప్రకటించింది. 'ప్రాజెక్ట్ ఉసోయారో' పేరుతో హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సరికొత్త ‘ఫైన్ బబుల్ టెక్నాలజీ, పలు రకాల మానిటరింగ్ సెన్సార్లతో పాటు కృత్రిమ మేధస్సు వ్యవస్థతో మనిషికి స్నానం చేయించే మిషన్ ను రెడీ చేస్తున్నది. ప్రాజెక్ట్ ఉసోయారో  లక్ష్యం వినియోగదారు శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచడంతో పాటు సంగీతం వింటూ నీటిపై ప్రదర్శించబడే వీడియోలను వీక్షించే అవకాశం ఉంది. ఈ మిషన్ లో పడుకునే వ్యక్తికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అందించేలా కంపెనీ రూపకల్పన చేస్తుంది. హ్యూమన్ వాషింగ్ మెషీన్‌లోని సెన్సార్‌లు సింపథెటిక్, పారాసింపథెటిక్ నరాల స్థితిని పర్యవేక్షిస్తుంటాయి. అంతర్నిర్మిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధ్యమైనంత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం హ్యూమన్ బాడీ నుంచి డేటా సేకరిస్తుంది.


Read Also: వయస్సుతో పనేముంది అంకుల్స్ - బైక్ నడిపేస్తున్న మూడేళ్ల చిచ్చర పిడుగు!


2025 నాటికి హ్యూమన్ వాషింగ్ మిషన్!


ప్రాజెక్ట్ ఉసోయారో అనేది సైన్స్ కో. లిమిటెడ్ ఛైర్మన్ యసుకి అయోమా పెట్ ప్రాజెక్ట్. సాన్యో హ్యూమన్ వాషింగ్ మెషీన్ ఒసాకాలో ఆవిష్కరించబడినప్పుడు అతని వయస్సు కేవలం 10 సంవత్సరాలు. అతడు ఈ ఆవిష్కరణ పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. భవిష్యత్ లో అవకాశం వస్తే ఈ ప్రాజెక్టును మరింత మెరుగుపర్చాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఈ అద్భుత మిషన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.  ప్రాజెక్ట్ ఉసోయారో 2024 నాటికి ఫంక్షనల్ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ ను తయారు చేస్తుందని భావిస్తున్నారు. 2025 ఒసాకా ఎక్స్‌పోలో అత్యాధునిక హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను ప్రదర్శించాలని సైన్స్ కో. లిమిటెడ్ కంపెనీ భావిస్తోంది.