గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ లేటెస్ట్ హంగులను అద్దుకుంది. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు పలు కీలక మార్పులు చేసినట్లు గూగుల్ వెల్లడించింది. రీష్రెష్ చేయబడిన లుక్ తో పాటు ఆకట్టుకునే వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సరికొత్త అప్ డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్ యాప్ ఇంటర్ ఫేస్ ను పూర్తిగా మార్చేసింది. ఫించ్ టు పించ్ జూమ్ తో పాటు యాంబియంట్ మోడ్ సహా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, యూట్యూబ్ లింక్ బటన్లతో పాటు లైక్, షేర్, డౌన్ లోడ్ బట్లనకు కొత్త రూపు తీసుకొచ్చింది.
సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ ముస్తాబు
యూట్యూబ్ ఈ ఏడాది 17వ యానివర్సరీని జరుపుకుంది. ఈ సందర్భంగా యూట్యూబ్ యాప్ కు చిన్న మేకోవర్ ఇస్తున్నట్లు కంపెనీ బ్లాగ్ లో పోస్ట్ చేసింది. ఇక కంటెంట్ క్రియేటర్లకు ప్రయోజనం కలిగే పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న సబ్ స్క్రైబ్ బటన్ ను మరింత బాగా కనిపించేలా చేసింది. వ్యూవర్ చూడగానే సబ్ స్క్రైబ్ బటన్ నొక్కే అవకాశం ఉంది. దీంతో పాటు యాంబియంట్ మోడ్ ను జోడించింది. ఇది టచ్-అప్‌ను కూడా పొందుతుంది. కొత్త ఆకారంతో పాటు హై కాంట్రాస్ట్ హైలెట్ చేస్తుంది. డైనమిక్ కలర్ శాంప్లింగ్ ని ఉపయోగించి చక్కటి అనుభూతిని పరిచయం చేస్తుంది. యాప్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్లే అవుతున్న వీడియోకు సరిపోయేలా ఉంటుంది. యాంబియంట్ మోడ్ YouTube వెబ్, మొబైల్ వినియోగదారులకు డార్క్ థీమ్‌లో అందుబాటులో ఉంటుంది.
ఆకట్టుకుంటున్న కొత్త మార్పులు
ప్రస్తుతం వచ్చిన నూతన అప్ డేట్స్ లో కీలకమైనది పించ్ టు జూమ్. ఐవోఎస్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లలో వీడియోను పించ్ తో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, వీడియో కంటెంట్ మంచి క్వాలిటీలో జూమ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. Precise seeking అనే సరికొత్త ఫీచర్ ను కూడా యూట్యూబ్ పరిచయం చేసింది. దీని సాయంతో వీడియోలో కావాల్సిన భాగాన్ని ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది.
"అభివృద్ధి దశలో మాకు కలర్ అనేది కీలకమైన థీమ్. వీక్షకుల అలవాట్లను కోల్పోకుండా మా యాప్‌లకు వైబ్రేషన్‌ని జోడించాలనుకుంటున్నాం. అది వారి సిఫార్సు చేసిన వీడియోలను ఆస్వాదించినా, లేదంటే కొత్త కంటెంట్ కోసం బ్రౌజ్ చేసినా కొత్త అనుభూతి కలిగించేలా చేయాలనుకున్నాం. అనేక ఆలోచనల అనంతరం యాంబియంట్ మోడ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఫీచర్లు వినియోగదారులకు మెరుగైన అనుభూతిని కలిగిస్తాయని భావిస్తున్నాం” అని యూట్యూబ్ వెల్లడించింది.
Read Also: వాట్సాప్ నుంచి సూపర్ అప్ డేట్, ఇకపై వన్ టు వన్ చాట్ లోనూ పోల్స్ పెట్టుకోవచ్చు!