టివీలో ప్రసారమవుతోన్న క్యాష్ ప్రోగ్రాంలో Like Share Subscribe మూవీ టీమ్ సందడి చేసింది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో మూవీ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్  ఫారియా అబ్దుల్లా, దర్శకుడు మేర్లపాక గాంధీ, నటులు బ్రహ్మాజీ, సుదర్శన్ లు పాల్గొన్నారు. ఈటీవీ లో వస్తోన్న ప్రోగ్రాంలలో క్యాష్ ప్రోగ్రాం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. సుమ కనకాల హోస్ట్ గా నిర్వహిస్తోన్న ఈ షోలో పాల్గొని చాలా మంది యాక్టర్స్ మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. గతంలో జాతిరత్నాలు మూవీ టీమ్ ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాం కి వచ్చిన జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కు మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో ఆ సినిమా పై ఆసక్తి నెలకొంది. అలా చాలా మంది సెలెబ్రెటీలు తమ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రాం లో పాల్గొంటున్నారు.


ఈసారి క్యాష్ ప్రోగ్రామ్ లో Like Share Subscribe మూవీ టీమ్ సందడి చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది. ప్రోగ్రాం లో మూవీ టీమ్ కు సుమ గ్రాండ్ వెల్కం చెప్పారు. నటుడు బ్రహ్మాజీ పై సుమ కనకాల పంచ్ లు, సుదర్శన్ పంచ్ లు బాగా పేలాయి. ప్రోమోలో బ్రహ్మాజి "కంటూ మై రూమ్" డైలాగ్ తో నవ్వులు పూయించారు. సుదర్శన్, బ్రహ్మాజీ ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. బ్రహ్మాజీ పై సుమ పంచ్ లు కూడా అదిరిపోయాయి. మొత్తం మీద ప్రోమో మొత్తం కామెడీగా సాగింది. ఈ ప్రోమో ఈ నెల 29న ఈటీవీలో ప్రసారం కానుంది. 


ఇక Like Share Subscribe మూవీ గురించి చెప్పాలంటే.. సినిమా టైటిల్ తోనే అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హీరో సంతోష్ శోభన్ కు హీరో గా మంచి గుర్తింపు వస్తోంది. ఇక ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. జాతిరత్నాలు సినిమాతో ఫారియకు మంచి క్రేజ్ వచ్చింది. చిట్టి గా ఫారియా చేసిన ఇన్నోసెంట్ క్యారెక్టర్ సినిమాలో నవ్వులు పూయించింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఫారియా. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే సినిమా ట్రైలర్ ను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. బ్రహ్మజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అయినా దర్శకుడు గాంధీ, హీరో సంతోష్ శోభన్ లకు బ్లాక్ బస్టర్ ఖాతాలో పడుతుందేమో చూడాలి.


Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్‌ ఎలా చేశారు?