పై ఫొటోలో చూశారుగా.. సరిగ్గా బైకు ఎత్తులేని ఈ కుర్రాడు ఎలా బైకులను నడుపుతున్నాడో. ఈ బుడ్డోడు మరెవరో కాదు.. ఐదుసార్లు WSSP చాంప్ అయిన కెనన్ సోఫుయోగ్లు కొడుకు జైన్. ఇప్పుడు తన తండ్రి సమక్షంలో బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు.  వాస్తవానికి మూడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల కోసం సాధారణ బ్యాలెన్స్ బైక్‌లు, డర్ట్ బైక్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ సోఫుయోగ్లు  కొడుకు వయసుకు మించిన పని చేస్తున్నాడు. తాజాగా ఈ బుడ్డోడు ఏకంగా హోండా గోల్డ్ వింగ్ 1800ను సునాయాసంగా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కొడుకు ముచ్చటపడి బైక్ నడుపుతున్న సమయంలో సోఫుయోగ్లు వీడియో తీసి.. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.    






తండ్రి సాయంతో రైడింగ్ విన్యాసాలు


తన కొడుకు బైక్ నడిపే సమయంలో సోఫుయోగ్లు అక్కడే ఉన్నాడు. బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తపడ్డాడు. బైక్ స్టార్ట్ చేసి వెళ్లే సమయంలో.. తిరిగి ఆపే సమయం వరకు అతడే చూసుకుంటున్నాడు. అంతేకాదు, తన కొడుకు రైడింగ్ చేసే సమయంలో ఆవీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. మూడేళ్ల వయసులో అంత బరువైన బైక్ ను బ్యాలెన్స్ చేస్తూ రైడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ, సోఫుయోగ్లు కొడుకు అద్భుతంగా బైక్ నడుపుతున్నాడు.  


Also Read: ప్రాణాలు కాపాడిన కారునే మళ్లీ కొన్నాడు, ఇది కదా నమ్మకం అంటే!






ఎలాంటి  బైక్ అయినా దూసుకుపోవాల్సిందే!


చిన్న పిల్లల మాదిరిగానే డర్ట్ బైక్‌లను నడిపాడు సోఫుయోగ్లు కొడుకు. అదే సమయంలో తన తండ్రితో పాటు బైక్ రైడింగులను దగ్గరుండి చూసేవాడు. అలా తనకూ బైకులు నడపాలనే ఆలోచన కలిగింది. తండ్రికి ఈ విషయాన్ని చెప్పి.. పిల్లాడు కూడా బైక్ రైడ్ మొదలు పెట్టాడు.  జైన్ 560cc పంచ్‌తో కూడిన Yamaha TMAX మ్యాక్సీ బైక్ నడిపి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఇక ఎలాంటి బైకును అయినా సునాయాసంగా నడపడం అలవాటు చేసుకున్నాడు. ప్రస్తుతం  జైన్ కు మోటార్ బైక్ లను నడపటం మరింత ఆసక్తికరంగా మారింది. కుటుంబ సభ్యులు సైతం అతడిని బైకులు నడిపేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం అతడు బైకులు నడిపే విధానాన్ని పరిశీలిస్తే మున్ముందు గొప్ప రేసు గుర్రంలా దూసుకెళ్లే స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. జైన్ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఒక లుక్కేయండి.