డుపులో ఉన్న బిడ్డ ఇంకా ఈ లోకాన్ని చూడక ముందే ‘అబార్షన్‌‌’తో చంపేయాలని అనుకోవడం పెద్ద పాపం. చట్టరీత్యా నేరం కూడా. కానీ, ఇటీవల అబార్షన్‌ను చట్టబద్దం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పురుషోన్మాదుల అత్యాచారాలు, అనుకోకుండా జరిగే సెక్స్ వల్ల ఏర్పడే గర్భాల వల్ల నరకయాతన అనుభవింస్తున్న మహిళలకు ఈ చట్టాలు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా శరీరం.. మా ఇష్టం’ అంటూ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. అబార్షన్లకు అనుమతి ఇవ్వని ప్రభుత్వాలపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్.. అంతా నోరెళ్లబెట్టే నిర్ణయం తీసుకుంది. అబార్షన్ పిల్‌కు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. అయితే, వైద్యులు ఈ మందును మహిళలకు సూచించే ముందు తప్పకుండా ఆ గర్భానికి కారణమైన వ్యక్తి, పార్టనర్ లేదా భర్త అనుమతిని తప్పకుండా తీసుకోవాలి.  


ఇప్పటివరకు అబార్షన్‌లను కేవలం అత్యవసర చికిత్సలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. గర్భం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటేనే అబార్షన్లు చేసి పిండాన్ని బయటకు తీస్తున్నారు. ఇక జపాన్ విషయానికి వస్తే.. అక్కడ 1948 ప్రసూతి చట్టం ప్రకారం.. అబార్షన్ కోసం నిర్వహించే సర్జరీకి జీవిత భాగస్వామి అనుమతి అవసరం. మూడు దశాబ్దాల కిందటే ఈ పిల్‌కు అనుమతి ఇచ్చిన యూకే, 2006లో ఆస్ట్రేలియా ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియాల దారిలోనే జపాన్ కూడా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే, అబార్షన్‌కు భర్త లేదా పార్టనర్ అనుమతి తీసుకోవాలనే రూల్‌ను మహిళా సంఘాలు తప్పుబడుతున్నాయి.  


బ్రిటీష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లైన్‌ఫార్మ్ ఇంటర్నేషనల్ గతేడాదే ఈ అబార్షన్ పిల్స్‌ను మార్కెట్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. జపాన్ సీనియర్ ఆరోగ్య అధికారి యసుహిరో హషిమోటో గత నెలలో పార్లమెంటరీ కమిటీతో మాట్లాడుతూ.. ఈ మాత్రను ఓరల్ మెడికేషన్(నోటీ ద్వారా ఔషదం తీసుకోవడం) ద్వారా తీసుకోడానికైనా సరే భాగస్వామి అనుమతి అవసరమని భావిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రతిపక్ష సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మిజుహో ఫుకుషిమా దీనిపై విమర్శలు చేశారు. 


‘‘స్త్రీకి తన భాగస్వామి ఆమోదం ఎందుకు అవసరం? అది ఆమె శరీరం. స్త్రీలు పురుషుల సొత్తు కాదు. వారి కంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. పౌరుల హక్కులను రక్షించబడాలి’’ అని ఆమె వాదించారు. ఇటీవల సెంట్రల్ టోక్యోలోని ఒక పార్క్‌లో చనిపోయిన నవజాత శిశువు చనిపోయింది. ఈ ఘటనలో పోలీసులు 21 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. ఆమె తన భాగస్వామిని సంప్రదించలేకపోయిందని, అతడి నుంచి లిఖిత పూర్వక సమ్మతిని పొందలేకపోయిందనే కారణంతో డాకర్లు ఆమెకు అబార్షన్ నిరాకరించారని ఆమె కోర్టుకు తెలిపింది. 


Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు


యాక్షన్ ఫర్ సేఫ్ అబార్షన్ జపాన్‌కు చెందిన కుమీ త్సుకహరా ఓ పత్రికతో మాట్లాడుతూ.. “జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పుడు లేదా జీవిత భాగస్వామి తన ఇష్టానికి విరుద్ధంగా ప్రసవించమని బలవంతం చేసినప్పుడు 'భర్తల సమ్మతి' సమస్య అవుతుంది. నోటి ద్వారా గర్భనిరోధకాలను చట్టబద్ధం చేయడానికి తొమ్మిదేళ్లపాటు చర్చ జరిగింది. ఎట్టకేలకు 1999లోనే అనుమతి లభించినా ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. అయితే, వయాగ్రాకు మాత్రం ఆరు నెలల్లోనే ఆమోదం తెలిపారన్నారు. 2020లో జపాన్‌లో 140,000 కంటే ఎక్కువ గర్భస్రావాలు జరిగాయి. 2016లో మహిళలపై వివక్ష నిర్మూలన నిమిత్తం భార్యాభర్తల సమ్మతిని తొలగించాలని ఐక్యరాజ్యసమితి కమిటీ జపాన్‌ను కోరింది.


Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!