అందంగా కనిపించడం అంత ఈజీ కాదు. ఇందుకు ఎంతో శ్రమించాలి. ఈ మేరకు చాలామంది ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. ముఖానికి పసుపు రాయడం, టమోట గుజ్జు ఇతరాత్ర పండ్లను రుద్దడం వంటివి చేస్తారు. వీటి వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందని భావిస్తారు. కొందరైతే.. ముఖానికి నేరుగా ఐస్ రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంగాపై తెరుచుకున్న రంథ్రాలు మళ్లీ మూసుకుపోతాయని భావిస్తారు. దీనిపై డెర్మటాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ శరద్, ఫిట్‌నెస్ ట్రైనర్ యస్మిన్ కరాచీవాలా ఏం చెప్పారో చూద్దాం. 


డాక్టర్ జయశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. ముఖంపై తెరుచుకొనే రంథ్రాలు లేదా గుంతలను తెరిచేందుకు, మూసేందుకు ఐస్ పెట్టడమనేది సరైన విధానం కాదు. ముఖ రంథ్రాల(skin pores)కు సంబంధించిన సరైన చికిత్సను సీరమ్‌ ద్వారా మాత్రమే అందించగలం. ముఖ్యంగా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ AHA (Alpha Hydroxy Acid), బేటా హైడ్రాక్సీ యాసిడ్ BHA (Beta Hydroxy Acid) లేదా రెటినోయిడ్స్ (Retinoids) మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలవు. ఈ సమ్మేళనాలు చర్మంలోని కొల్లాజెన్‌ను ప్రేరేపించి బిగువుగా ఉండేలా చేస్తాయి. 


మరి.. ముఖానికి ఐస్ రాయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదా?: ఫలితం ఉంది, కానీ.. అది ముఖంపై ఉండే రంథ్రాలను మూయడానికి మాత్రం పనిచేయదు. కేవలం మన ముఖాన్ని ఫ్రెష్‌గా మార్చేందుకు మాత్రమే ఐస్ ఉపయోగపడుతుంది. అలాగే.. ముఖం వాచినట్లు లేదా ఉబ్బినట్లు ఉంటే.. ఐస్‌ను రుద్దడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖం మంటగా ఉన్నప్పుడు ఐస్‌ను పెడితే.. నొప్పి తగ్గుతుంది. కాబట్టి.. ఇకపై ఐస్ పెట్టేప్పుడు.. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. 


Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. 






Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..