ఆ నటి చిన్న వయస్సులోనే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తెలుగులో టాప్ హీరో పక్కన హీరోయిన్‌గా మెప్పించింది. ఎంతో అమాయకంగా ముద్దుగా కనిపించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన చిరకాల స్నేహితుడు, వ్యాపార భాగస్వామిని పెళ్లాడబోతోంది. చైల్డ్ ఆర్టిస్ గా సినీ కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది. ఒకటి రెండు సినిమాలకే ఆమెలో శారీరకంగా చాలా మార్పులు చోటు చేసుకోవడంపై అప్పట్లో సందేహాలు నెలకొన్నాయి.
16 ఏళ్ల వయస్సులో ఆమె గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్లే అలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆమె తండ్రే ఈ ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె తల్లి ఒక స్కిన్ స్పెషలిస్ట్ అని, ఆమె సారథ్యంలోనే ఆ హీరోయిన్‌కు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్స్ ఇచ్చారని ఆమె తండ్రి అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే వీటి గురించి ఆమె ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే, అది కేవలం ఆరోపణలు మాత్రమే. ఆమె నిజంగా ఆ ఇంజక్షన్లు తీసుకుందా? లేదా అనే విషయంపై ఎక్కడా ఆధారాలు లేవు. ఆమె మాత్రమే కాదు, ఇప్పటికీ చాలామంది రంగుల ప్రపంచాన్ని ఏలేందుకు ఇలాంటి ఇంజక్షన్లను ఎంచుకుంటున్నారు. మరి ఈ ట్రెండ్ ఆరోగ్యానికి మంచిదేనా?
గ్రోత్ హార్మోన్లు అంటే ఏంటి?
మెడికల్ న్యూస్ ప్రకారం మానవ పెరుగుదల హార్మోన్లు ఒక వ్యక్తి ఎత్తు, ఎముకలు, కండరాలని ప్రభావితం చేస్తాయి. శరీర సాధారణ పెరుగుదల ఉంటుంది. శరీరంలోని వివిధ హార్మోన్లు జీవక్రియ, లైంగిక పనితీరు, పునరుత్పత్తితో పాటు శరీర విధులు, ప్రక్రియని నియంత్రిస్తాయి. వ్యాయామం, హార్మోన్ల వల్ల సహజంగా శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. నిద్ర, ఒత్తిడి, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటాన్ని కూడా గ్రోత్ హార్మోన్ స్థాయిలు పెంచుతాయి.
గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుంది?
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు పెద్దలు, పిల్లలు తీసుకోవచ్చు. నిపుణులు ఈ ఇంజెక్షన్లని మోతాదు ప్రకారం వారంలో ఒకసారి లేదా రోజువారీగా కూడా ఇస్తారు. ఇది శరీరంలోని లోపం తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలోని సహజ పెరుగుదల హార్మోన్ల ప్రవర్తన అనుకరించే విధంగా ఈ గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్స్ రూపొందిస్తారు. గ్రోత్ హార్మోన్ లోపం కోసం నిర్దిష్ట చికిత్స తీసుకునే వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే వీటిని డాక్టర్ మాత్రమే సూచించాలి. తక్కువ గ్రోత్ హార్మోన్ స్థాయిలు ఉన్న పిల్లలు లేదా పెద్దలకి నిద్ర, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు వైద్య విధానాలకి అనుగుణంగా వీటిని ఇంజెక్ట్ చేస్తారు.
వీటిని బట్టే ఈ చికిత్స ఇస్తారు
☀ వయస్సు
☀ ఆరోగ్య, వైద్య చరిత్ర
☀ మానసిక పరిస్థితి
☀ ట్రీట్మెంట్ తట్టుకునే పరిస్థితి
గ్రోత్ హార్మోన్ సరిగాలేని పిల్లలకు ఈ చికిత్స చేయడం వల్ల సాధారణ ఎదుగుదలకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల అనార్థాలు
☀ కండరాల నొప్పులు
☀ జాయింట్లలో నొప్పి, అసౌకర్యంగా ఉండటం
☀ దీర్ఘకాలిక తలనొప్పి
☀ చేతులు, కాళ్ళు వాపు
☀ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అయితే ఇన్సులిన్ అసమతుల్యత
☀ శరీరంలో నీటిని హరించివేయడం
☀ కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మైగ్రేన్ వల్ల మెదడు దెబ్బతింటుందా? షాకింగ్ విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం