స్త్రీ జీవితంలో పీరియడ్స్ చాలా ముఖ్యమైనవి. అవి ఆమె ఆరోగ్యానికి సూచికలే కాదు,తల్లితనానికి ఎంతో ప్రధానమైనవి కూడా. అందుకే ఒక్క నెల పీరియడ్స్ తప్పిన కూడా జాగ్రత్త పడాలి. పెళ్లి కాని వారికైతే ఒక్క నెలా పీరియడ్స్ తప్పినా ఏదైనా అనారోగ్యం ఉందేమో చెక్ చేయించుకోవాలి. పెళ్లయిన వారు గర్భం ధరించామేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ గర్భం కాకపోతే ఆ నెల పీరియడ్స్ ఎందుకు రాలేదో వైద్యుడిని కలిసి తెలుసుకోవాలి. చాలా మంది పీరియడ్స్ సమయంలో చాలా బాధను అనుభవిస్తారు. పొట్ట ఉబ్బరం, తిమ్మిర్లు, పొత్తి కడుపు నొప్పి,చికాకు, కోపం ఇలా ఎన్నో కలుగుతాయి. కొంతమంది స్త్రీలో రుతుక్రమానికి ముందు రొమ్ములు సున్నితంగా మారడం, ముట్టుకుంటే నొప్పి రావడం వంటివి ఫీలవుతారు. ఇలాగే కొన్ని రోజులు పాలూ కొనసాగితే రొమ్ములు పుండ్లు పడే అవకాశం ఉంది. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 


ఎందుకంటే...
ఇన్‌స్టాగ్రామ్ లో డాక్టర్ తనయ ఈ సమస్య గురించి చర్చించారు. పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో కాస్త నొప్పి రావడం సహజమేనని చెప్పారు. పీరియడ్స్ వస్తున్నాయంటే మహిళ శరీరం బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉందని అర్థం. అందుకే పీరియడ్స్ ముందు రొమ్ముల్లో పాలు ఉత్పత్తి చేసే గ్రంధులు పనిచేయడం మొదలుపెడతాయి. దీని వల్ల కాస్త సున్నితంగా, నొప్పిగా అనిపిస్తాయి. ప్రొసెస్టరాన్ హార్మోను రుతుచక్రం, గర్భం, పిండ ఉత్పత్తిలో పాల్గొనే సెక్స్ హార్మోను. రొమ్ములు సైజు పెరగడం కూడా జరుగుతుంది. రొమ్ములు బరువుగా మారడం, నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. 


ఎప్పుడు వైద్యుడిని కలవాలి?
ప్రతి నెలా వచ్చే నొప్పి మీకు తెలుస్తుంది. అలా కాకుండా నొప్పిలో మార్పు వచ్చినా, అంటే తీవ్రంగా మారినా లేక చనుమొనల నుంచి స్రావాల్లాంటివి డిశ్చార్జ్ అవుతున్నా, రొమ్ముల్లో ఏదైనా గడ్డ ఉన్నట్టు అనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇవి రొమ్ము క్యాన్సర్ ను సూచిస్తాయి. 



ఇలా చేయండి...
పీరియడ్స్ వచ్చే ముందు, వచ్చాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 


1. పుష్కలంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. ఇవి పొత్తి కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. 
2. ఈ సమయంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ఆల్కహాల్,కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 
3. కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర తగ్గినా ప్రభావం పడుతుంది. రోజుకు తొమ్మిది గంటల నిద్ర అవసరం. 
4. రోజూ అరగంట పాటూ వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి.


Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు


Also read: షూ లేస్ చెవిరింగులు, ధరెంతో తెలిస్తే మీ షూ లేసులు కూడా ఇలాగే అమ్మేయాలనిపిస్తుంది

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.