వర్క్ నుంచి కాస్త రిలీఫ్ కావాలా? అయితే ఇదిగో ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను ఓసారి చూడండి. దీని వల్ల మీకు కాసేపు రిలీఫ్ దొరకడమే కాదు, మీ మెదడులో ఏ వైపు భాగం ఎక్కువగా, చురుగ్గా పనిచేస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ముందుగా ఇచ్చిన చిత్రాన్ని చూడండి. అందులో రెండు జంతువులు ఉన్నాయి. ఒకటి బాతు, రెండోది ఉడుత. ఈ ఫోటోను చూడగానే మీరు ఈ రెండు జంతువులను గుర్తించేస్తారు. అయితే ఆ రెండింటిలో కూడా ఏ జీవిని గుర్తించారు అన్నదే పాయింట్. ముందుగా ఉడుతను గుర్తిస్తే దాని ఫలితం ఒకలా ఉంటుంది, అదే బాతును గుర్తిస్తే మరోలా ఉంటుంది. ఆ ఫలితాల వివరాలు కింద ఇచ్చాం చదివి తెలుసుకోండి.
ఉడుత
చిత్రంలో మీకు మొదట ఉడుత కనిపించిందా? అంటే మీ మెదడు మొదట ఉడుతను కనిపెట్టిందన్నమాట. దానికర్ధం మెదడు ఎడమ భాగం చురుగ్గా పనిచేస్తున్నట్టు లెక్క. తార్కిక, విశ్లేషణాత్మక ఆలోచనలు ఎక్కువ. జీవితాన్ని అలాంటి ఆలోచనలతోనే జయించాలని భావిస్తారు. మీ తెలివి, ఆలోచించే శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అవసరం అయ్యే ఉద్యోగాలకు సెట్ అవుతాయి. మీకు సృజనాత్మకత తక్కువగా ఉంటుంది.మీరు చుట్టూ ఉన్నవారిని మీ వైపు ఆకర్షించేలా చేసుకుంటారు. మీరు చర్చల్లో ఆలోచనలు రేకెత్తించాలా మాట్లాడగలరు. అలాగే మనస్సును కదిలించేలా మాట్లాడగలరు.
బాతు
మీ మెదడు మొదట బాతును గుర్తించిందంటే అర్థం కుడి వైపు మెదడు భాగం అద్భుతంగా పనిచేస్తున్నట్టు. మీకు కొన్ని అంశాల్లో ప్రతిభావంతులు అయ్యే అవకాశం ఉంది.సృజనాత్మక రంగాల్లో మీరు రాణించే అవకాశం ఉంది.మీరు శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ లోకం అందంగా రంగులతో నిండి ఉండాలని కోరుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు.
ఈ రెండు ఫలితాలను బట్టి మీరు ఎలాంటి వారలో ఒకసారి ఆలోచించండి. ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రజలను అలరించడంలో ముందున్నాయి. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడంటతే టీవీలు, సినిమాలు, రకరకాల ఆన్ లైన్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ పూర్వం అలాంటివేమీ లేవు. అప్పటి ప్రజలను ఇవి చాలా ఆకర్షించాయని చెప్పుకుంటారు. వీటిని సృష్టించింది ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు. విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.
Also read: షూ లేస్ చెవిరింగులు, ధరెంతో తెలిస్తే మీ షూ లేసులు కూడా ఇలాగే అమ్మేయాలనిపిస్తుంది
Also read: ఇలా చేస్తే గుండె పోటు, మెదడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70 శాతం తగ్గించుకోవచ్చు, ఏం చేయాలంటే