Facts about International Womens Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఇప్పుడేదో ఫెమినిస్టులు.. ఆడవారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు కాబట్టి ఈ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనుకుంటే పొరపాటే. వందళ ఏళ్ల క్రితం నుంచి దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహిళా దినోత్సవాన్ని 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఆమోదించింది. ఆమోదనకు ముందు నుంచి కూడా ఈ స్పెషల్ డేని జరుపుకున్నారు. ఆమోదన పొందిన తర్వాత ప్రతి ఏడాది దీనిని జరుపుతున్నారు.


సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ.. ఎందరికో స్పూర్తిగా నిలవాలని ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సాహించే విధంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుతారు. అయితే ఈ రోజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఈ సంవత్సరం ఏ థీమ్ ఫాలో అవుతున్నారో? ఏ కలర్​ని రిప్రెజెంట్ చేస్తున్నారో.. దానికి గల ప్రాధన్యత ఏమిటో  ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్


కొన్నిదేశాల్లో మహిళా దినోత్సవం రోజు అధికారిక సెలవు దినం అని మీకు తెలుసా? క్యూబా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, కంబోడియా, లావోస్, రష్యా వంటి అనేక ప్రాంతాల్లో ఉమెన్స్​ డే రోజు అధికారికంగా సెలవు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో మదర్స్ డేతో పాటు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా కలిపి జరుపుకుంటారు. సెర్బియా, అల్బేనియా, ఉజ్బెకిస్తాన్, మాసిడోనియా వంటి దేశాల్లో రెండు సెలవులు కలిపి ఇస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా యునైటెడ్ స్టేట్స్​(USA)లో మార్చి నెలను Womens History Monthగా ప్రకటించారు. 


మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య మహిళా హక్కులు, అంతర్జాతీయ శాంతి దినోత్సవం అని కూడా అంటారు. మొట్టమొదటి అంతర్జాతీయ దినోత్సవాన్ని 1911లో మార్చి 19న జరుపుకున్నారు. 1913లో దానిని మార్చి 8కి మార్చారు. 1975లో ఐక్యరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా ఆమోదించింది. మీకో విషయం తెలుసా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోగోలో స్త్రీ లింగ చిహ్నం ఉంటుంది.  మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1971 మార్చి 8న రష్యా మహిళలు బ్రెడ్, శాంతి కోసం సమ్మె చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి తాత్కాలిక ప్రభుత్వం రష్యా మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. 


ఉమెన్స్ డే 2024 థీమ్ & కలర్ (International Women's Day Theme)


ఈ స్పెషల్ డే థీమ్ కలర్స్ తెలుసా? పర్పుల్, గ్రీన్, వైట్. ఇవి న్యాయం, ఆశ, స్వచ్ఛత, గౌరవాన్ని సూచిస్తాయి. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఓ థీమ్ ఉంటుంది. దానికి అనుగుణంగా వేడుకలు చేస్తారు. ఈ సంవత్సరం థీమ్​గా ఐక్యరాజ్య సమితి.. మహిళలలో పెట్టుపడి.. పురోగతిని వేగవంతం చేసేందుకు ప్రతిపాదించింది. ఈ స్పెషల్ డే రోజు.. మీ జీవితంలోని మహిళలకు సందేశాలు, కోట్​లు, శుభాకాంక్షలు, ఫోటోలు పంపి విషెష్ చెప్పవచ్చు. వారు మీ జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేసి.. వారిలోని సత్తాను గుర్తించి.. వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సాహించండి.


Also Read : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే