Insomia Affects Women : రాత్రి పడుకోవడం లేట్​ అయినా సరే.. ఉదయాన్నే ఇంట్లో ఎవరు లేచిన లేవకపోయినా.. నిద్రలేచి ఇంటిల్లీపాదికి అన్ని సమకూర్చీ.. ఇంటిపనులు చేస్తారు మహిళలు. అన్ని సమకూర్చే పెట్టే మహిళలకు మరి ఈ నిద్ర సరిపోతుందా? ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా అధ్యయనం చేశారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్​లో దీని గురించి ప్రచురించారు. ఈ స్టడీలో వారు పలు షాకింగ్ విషయాలు గుర్తించినట్లు తెలిపారు. 


మూడువేల మందిపై 22 ఏళ్లు అధ్యయనం..


ఈ అధ్యయనం ప్రకారం మధ్య వయస్కులైన మహిళలు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే వారిలో హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా పిట్స్​బర్గ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 42 నుంచి 52 సంవత్సరాల వయస్సు గల దాదాపు 3000 మంది మహిళలపై ఈ అధ్యయం చేశారు. 22 సంవత్సరాల పాటు వారిని ట్రాక్ చేశారు. వారు ఎలా నిద్రపోయారు? వారి గుండె పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయే స్త్రీలు 6 గంటలు కంటే ఎక్కువ నిద్రపోయే వారి కంటే గుండె సమస్యలతో బాధపడుతున్నారని ఈ స్టడీ తెలిపింది. 


నిద్రలేకుంటే కలిగే సమస్యలు ఇవే..


నిద్ర, గుండె జబ్బుల మధ్య సంబంధం గురించి ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు జరిగాయి. నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు పెరగడం, ఇన్సులిన్ సమస్యలు పెరగడం, రక్తనాళాలకు హాని కలగడం వంటివి సంభవించవచ్చు. పేలవమైన నిద్ర కూడా మహిళల్లో ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఆకలి సంకేతాలకు అంతరాయం కలిగిస్తుంది. మధ్య వయస్కులలో పెరుగుతున్న నిద్ర సమస్యలు, గుండె ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది. దీనిలో భాగంగా రాత్రిపూట కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని సలహా ఇస్తుంది. యువత కూడా నిద్ర విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేసుకోవద్దని చెప్తున్నారు. 


మహిళల్లో సరైన నిద్రతో కలిగే లాభాలు ఇవే.. 


నాణ్యమైన నిద్ర మహిళల్లో ఏకాగ్రత, ఉత్పాదకత, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక శ్రేయస్సును ఇది ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితి మీ కంట్రోల్​లో ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకలిని కంట్రోల్​లో ఉంచి.. ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. స్లీప్ మెమెరీ కన్సాలిడేషన్​లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మీరు సమర్థవంతంగా పనులు చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. నిద్ర అనేది ఒత్తిడి సమస్యలను దూరం చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ, ఆందోళన, ఇతర మానసిక సమస్యలను దూరం చేస్తుంది. సరైన నిద్ర మీ ఆలోచన తీరును మెరుగుపరుస్తుంది. ఇది తెలివైన నిర్ణయాలకు దారి తీస్తుంది. 


Also Read : బరువు తగ్గాలనుకుంటే స్మూతీలు తాగకూడదట.. ఎందుకంటే..





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.