Chaari 111 First Review: వెన్నెల కిశోర్ ఫ్యాన్స్ రెడీనా - చారి 111 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Chaari 111 movie review: వెన్నెల కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చింది. అదెలా ఉందో చూడండి.

Continues below advertisement

Vennela Kishore's Chaari 111 Movie Review: 'వెన్నెల' కిశోర్ స్టార్ కమెడియన్. ఆయనలో నటుడి కంటే ఆయన కామెడీ హైలైట్ అయిన సినిమాలు ఎన్నో! ఆయన కామెడీతో గట్టెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. అటువంటి 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్ నవ్వించాయి. థీమ్ సాంగ్ బావుంది. మరి, సినిమా ఎలా ఉంటుంది? అంటే... మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్ నుంచి 'చారి 111' ఫస్ట్ రివ్యూ వచ్చింది. అది ఎలా ఉందో చూడండి. 

Continues below advertisement

చారి 111... ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్!
'చారి 111' సినిమా ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ అని సైమన్ కె కింగ్ పేర్కొన్నారు. ఏ సినిమాకు అయినా సరే ఫస్ట్ ఆడియన్ సంగీత దర్శకుడే. ప్రేక్షకులు అందరి కంటే ముందు సినిమా చూసేది మ్యూజిక్ డైరెక్టరే. రీ రికార్డింగ్ చేయడానికి ముందు ఒకసారి, నేపథ్య సంగీతం అందించిన తర్వాత మరోసారి సౌండ్ చెకింగ్ కోసం చూస్తారు.

'చారి 111' సినిమాను థియేటర్లకు పంపిన తర్వాత సైమన్ కె కింగ్ ఓ ట్వీట్ చేశారు. ''సినిమాను లాక్ చేశాం. లోడ్ చేశాం. థియేటర్లలో బుల్లెట్ తరహాలో పేలడానికి రెడీగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని చాలా ఎంజాయ్ చేశా.  ష్యూర్ షాట్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెన్నెల కిశోర్ ఫ్యాన్స్ వేయండ్రా... బీజీఎం'' అని సైమన్ పేర్కొన్నారు. సో... థియేటర్లలో ఈ సినిమా ఎంత నవ్విస్తుందో చూడాలి. ఒక కమెడియన్ చేయాల్సిన సినిమా ఇదని, అందుకే తాను చేశానని 'వెన్నెల' కిశోర్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Also Read: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?

'చారి 111' చిత్రానికి టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్, నైనా గంగూలీ జంటగా... యాంకర్ వర్షిణి సౌందర్ రాజన్ ఓ ప్రధాన పాత్రలో నటించిన 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన తీసిన చిత్రమిది. సుమంత్ సినిమా జీ 5 ఓటీటీలో విడుదల అయితే... 'వెన్నెల' కిశోర్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ప్రొడ్యూస్ చేశారు.

'చారి 111' సినిమాలో 'వెన్నెల' కిశోర్ సరసన తమిళమ్మాయి సంయుక్తా విశ్వనాథన్ నటించారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇంతకు ముందు తమిళంలో వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. అయితే... లేటెస్ట్ యూట్యూబ్ సెన్సేషనల్ సాంగ్ 'katchi sera'లో ఆమె స్టెప్స్ వైరల్ అయ్యాయి. కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్ అన్నట్టు కాకుండా సంయుక్తతో యాక్షన్ సీక్వెన్సులు, స్టంట్స్ కూడా చేయించారు.

Also Readఅందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

Continues below advertisement