SS Karthikeya Release Premalu in Telugu: ప్రస్తుతం భాషతో, ఇండస్ట్రీతో సంబంధం లేకండా దేశవ్యాప్తంగా సినిమాలు అలరిస్తున్నాయి. అన్ని భాషల్లో రిలీజ్‌ అవుతూ ఆడయన్స్‌ ఆదరణ పొందతున్నాయి. రీజనల్‌ సినిమా అయినా హిట్‌ టాక్‌ వస్తే చాలు మరో భాషలోకి డబ్‌ అవుతున్నాయి. మలయాళ, కన్నడ  బ్లాక్‌బస్టర్‌ అయినా చాలా చిత్రాలు తెలుగులో డబ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ తెలుగు ఆడియన్స్‌ వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగులో మంచి డిమాండ్‌ ఏర్పడింది. దానికి రీసెంట్‌గా విడుదలైన ప్రేమలు మూవే బెస్ట్‌ ఎక్సాంపుల్‌. తెలుగులో డబ్‌ కూడా కానీ ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.


ఫిబ్రవరి 9న మలయాళంలో థియేటర్లో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ పలు థియేటర్లో రిలీజైంది. ఒరిజినల్‌ భాషలోనే విడుదలైన ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్‌ సైతం క్యూ కడుతుండటం విశేషం. డబ్‌ కానీ ఈ చిత్రానికి కూడా ఈ రేంజ్‌లో రెస్సాన్స్‌ ఉంటే అదే సినిమా తెలుగులో డబ్‌ అయితే రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో కదా. ఇదే ఆలోచన మన తెలుగు నిర్మాతలు తట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించినా ఇక్కడ డిస్ట్రీబ్యూట్ చేసే సంస్థ ఏదనేది ఫైనల్‌ కాలేదు. నిన్నటి వరకు దీనిపై టాలీవుడ్‌ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ లైన్ క్లియర్ అయ్యింది.  ప్రేమలు సినిమాను తెలుగులో అందించేందుకు రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ రెడీ అయ్యాడు. ఈ సినిమాతోనే అతడు నిర్మాతగా మారబోతున్నాడు. తాజాగా ఈ మూవీ తెలుగు రైట్స్‌ దక్కించుకున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చాడు.






'బాహుబలి' థీమ్ తో ప్రేమలు ప్రకటన


"ప్రేమలు మూవీతో డిస్ట్రిబ్యూటర్‌గా మారాను. ఈ సినిమాను మలయాళంలో చూశాక.. తెలుగులో రిలీజ్‌ చేయాలనే తపన మొదలైంది. అందుకే ఆలస్యం చేయకుండ 'ప్రేమలు' చిత్రం కోసం డిస్ట్రబ్యూటర్‌గా మారాను. ఈ నా తొలి ప్రయత్నం విజయం అవుతుందని ఆశిస్తున్నాను. మార్చిలో మూవీని తెలుగులో రిలీజ్‌ చేయబోతున్నాం. ఇక్కడ మీ కోసం ప్రేమలు టీం చేసిన చిన్న ప్రయత్నం" అంటూ బాహుబలి థీమ్‌లో మూవీపై ప్రకటన ఇచ్చాడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ. ఫిబ్రవరి 9న థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ అదే జోరుతో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.  సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.60 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. ఈ ఫీల్ గుడ్ లవ్ మూవీకి ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందింది ఈ చిత్రం తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఎస్‌ఎస్‌ కార్తీకేయ ఫుల్‌స్టాప్‌ పట్టాడు. 'ప్రేమలు' మూవీని తెలుగులో అందిస్తున్నట్టు చెప్పి మూవీ లవర్సని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక త్వరలోనే ప్రేమలు తెలుగు రిలీజ్‌ డేట్‌పై ప్రకటన కూడా ఇవ్వనున్నాడట. 


Also Read: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు - నటి కస్తూరి కామెంట్స్ వైరల్