కప్పుడు చదువు ఉచితంగా లభించేది. కానీ, ఇప్పుడు అది వ్యాపారం. ‘నాణ్యమైన విద్య’ పేరుతో విద్యాసంస్థలు ఎంతగా దోచుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా చోద్యం చూడటం తప్పా.. వారిని నియంత్రించే చర్యలేవీ తీసుకోవు. అందుకు కారణం కూడా మీకు బాగా తెలుసు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయోజకులైతే చాలంటూ.. వారు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఆస్తులు అమ్ముకుని మరీ చదివిస్తున్నారు. అయితే, స్విట్జర్లాండ్‌లోని ఈ స్కూల్లో మీరు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నా చదివించలేరు. ఎందుకంటే.. ఈ స్కూల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కానీ, అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు గురించి తెలిస్తే.. ‘ఫీజు’ న్యాయంగానే ఉందనిపిస్తుంది. 


జెనీవా సరస్సు అంచును ఆనుకుని ఉన్న ఇన్‌స్టిట్యూట్ లే రోసే(Institut Le Rosey)కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ స్కూల్‌ను 1880లో పాల్ కార్నల్ అనే వ్యక్తి స్థాపించాడు. అక్కడి ప్రకృతి అందాలకు ముగ్దుడైన పాల్.. ఆ స్కూల్‌ను స్థాపించాడు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు చదువు చెప్పేవాడు. ఇప్పుడు ఈ స్కూల్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక్కడ విశాలమైన కాంప్లెక్స్‌తోపాటు ఒలిపింక్-పరిమాణ స్విమ్మింగ్ పూల్స్, టెన్నీస్ కోర్టులు, టెన్నీస్ కోర్టులు కూడా ఉన్నాయి. అలాగే చలికాలంలో మంచు కురిసే వేళలో విద్యార్థులు ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ స్కీయింగ్ కూడా అందుబాటులో ఉంది.


ఇక్కడ కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే విద్యార్థులను చేర్చుకుంటారు. ప్రతి 430 మంది విద్యార్థులకు 150 మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఒక్కో తరగతిలో సుమారు 10 లేదా అంత కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. ఫలితంగా టీచర్లు ప్రతి విద్యార్థిపైనా శ్రద్ధ చూపుతారు. ఈ స్కూల్‌కు అంతర్జాతీయ పాఠశాలగా గుర్తింపు ఉంది. కాబట్టి, ఈ స్కూల్‌లో మీ పిల్లలను కూడా చేర్చవచ్చు. కానీ, విదేశీ విద్యార్థుల కోసం కేవలం 10 శాతం సీట్లు మాత్రమే కేటాయించారు. 


7 నుంచి 18 సంవత్సరాలు కలిగిన విద్యార్థులు మాత్రమే ఇక్కడ చదువుతారు. ఏటా కేవలం ముగ్గురికి మాత్రమే స్కలార్‌షిప్ లభిస్తుంది. మిగతావారంతా స్కూల్ యాజమాన్యం నిర్ణయించే ఫీజును చెల్లించాల్సిందే. చిత్రం ఏమిటంటే.. ఇక్కడ విద్యార్థుల్లో చాలామంది తల్లిదండ్రులు ఈ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దాదాపు 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు వారి అర్హతను బట్టి.. ఈ స్కూల్‌లో బోధించే అవకాశం లభిస్తుందట. లే రోసేను ‘‘రాజుల పాఠశాల’’ అని కూడా అంటారు. స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్, ఈజిప్ట్ రాజు ఫువాడ్ II, బెల్జియం రాజు ఆల్బర్ట్ II, ఇరాన్ షా, అగాఖాన్, గ్రీస్ యువరాణి మేరీ-చంటల్ వంటి వారు ఇక్కడ చదువుకున్నారు. ఒక శతాబ్దానికి పైగా యూరప్‌లోని కొన్ని ప్రసిద్ధ కుటుంబాలకు ఈ పాఠశాల విద్యను అందించింది. అందుకే, ఈ స్కూల్‌కు అంత డిమాండ్. 


Also Read: హథవిధీ, జైల్లోనే ‘తొలిరాత్రి’ - కారణం తెలిస్తే, మీరు షాకవ్వడం ఖాయం!


ఇన్‌స్టిట్యూట్ లే రోసే‌కు ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న క్రిస్టోఫ్ గూడిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి ఫీజు ఎక్కువ అనే భావన చాలామందిలో ఉంది. కానీ, ఇది సంస్థకు లాభాలను అందిస్తుందనుకోవడం పొరపాటే. డబ్బు సంపాదన కోసమే ఇంత ఫీజులు వసూలు చేయడం లేదని తెలిపారు. తాము విరాళాల సేకరణకు వ్యతిరేకమని, పూర్తిగా స్వతంత్రంగా ఉంటున్నామని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ఈ స్కూల్లో తల్లిదండ్రులను మాత్రమే దాతలుగా పరిగణిస్తామన్నారు. ఈ స్కూల్‌లో చదవాలంటే విద్యార్థులు ఏడాదికి 130,000 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.9.8 కోట్లు) వార్షిక ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


Also Read: వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..